Nuziveedu IIIT Vice Chancellor Anarchy & Professors Problems :విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం అది. అక్కడ రాజకీయాలకు చోటుండకూడదు. కానీ గత ఐదేళ్లు ఆ వర్సిటీ కులపతి, ఉప కులపతులు ఒంటెద్దు పోకడలు పోయారు. ఏకపక్ష నిర్ణయాలతో విద్యార్థులను, అధ్యాపకులను ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం రాకతో బాధితులంతా స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతున్నారు.
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత ఐదేళ్లపాటు కులపతి, ఉపకులపతి తీసుకున్న నిర్ణయాలు తలనొప్పిగా మారాయి. వర్సిటీకి పెద్ద తలగా వ్యవహరించే వీసీ క్యాంపస్ అభివృద్ధిని గత ఐదేళ్లుగా పక్కన పెట్టారు. అధ్యాపకుల సంక్షేమాన్ని, విద్యార్థులను పట్టించుకోవడం మానేశారు. ప్రభుత్వంతో చర్చించి యూజీసీ నిధులను తీసుకురాకపోగా రోజువారీ వ్యవహారాల్లో తలదూర్చుతూ అధ్యాపకులను, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఐటీఐ కాలేజీలను గాలికొదిలేసిన జగన్ సర్కార్! 8వేల రెగ్యులకు పోస్టులకు 1,140 మాత్రమే బోధనా సిబ్బంది
YSRCP Destroyed Rules In Universities In Andhra Pradesh : వర్సిటీలోని అధ్యాపకులంతా ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వారే. ఇక్కడి రాజకీయాలను భరించలేక కొంత మంది ఇతర విశ్వవిద్యాలయాలకు వెళ్లిపోయారు. వర్సిటీ కులపతిగా ఉన్న కేసీరెడ్డి వేధింపులే ఇందుకు కారణమని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ హయాంలో తమకు రెండుసార్లు ఇంక్రిమెంట్లు ఇస్తే గడిచిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఇవ్వలేదని, జీతాలు ఇవ్వడమే ఎక్కువంటూ హేళన చేశారని అధ్యాపకులు వాపోతున్నారు. సమస్యలు చెప్పుకుందామని ప్రయత్నిస్తే అణచివేస్తున్నారని మండిపడుతున్నారు.