తెలంగాణ

telangana

ETV Bharat / state

దయనీయంగా నర్సరీ రైతుల పరిస్థితి - ప్రభుత్వ రాయితీ అందించాలంటూ వేడుకోలు - Nursery Farmers Problems

Nursery Farmers Issues in Telangana : ప్రకృతికి మూలధనం చెట్లు. రాష్ట్రం పచ్చగా ఉండాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం మొక్కల పెంపకానికి రాయితీ ఇచ్చేది. దీంతో పలు జిల్లాల్లో మెుక్కలు పెంచే నర్సరీలు భారీగా పుట్టుకొచ్చాయి. వీరి నుంచి హరితహారం కింద అప్పట్లో మొక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేసేది. కానీ గత మూడేళ్లుగా మొక్కలను కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. కనీసం కూలీలకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Etv Bharat
Nursery Farmers Issues in Telangana

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 12:34 PM IST

Nursery Farmers Issues in Telangana : సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ పట్టణం నర్సరీలకు ప్రసిద్ధి గాంచింది. పటాన్‌చెరులో జాతీయ రహదారిని ఆనుకొని ఎక్కువగా నర్సరీలు ఏర్పడ్డాయి. దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడ రైతులు నర్సరీల మీద జీవిస్తూ పలువురికి జీవనోపాధిని కల్పిస్తున్నారు. ఈ ప్రాంతం గుండా జాతీయ రహదారి ఉండటంతో వివిధ రాష్ట్రాలకు వివిధ రకాల మొక్కలను ఎగుమతి చేస్తున్నారు.

గత ప్రభుత్వం హరితహారం పథకం ద్వారా రైతులకు రాయితీలు ఇవ్వడంతో నర్సరీలకు మరింత ఆదరణ పెరిగింది. ఈ నర్సరీల్లో మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, ఇలా అనేక రకాల మెుక్కలతో పాటు పూలు, అందానికి వాడే మొక్కలు సైతం పెంచుతున్నారు. హైదరాబాద్‌ నుంచి ముంబయి వేళ్లే మార్గం కావడంతో ఈ నర్సరీలు ప్రయాణికులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు సైతం ఇక్కడ మెుక్కలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.

'మాకు మొక్కలంటే ప్రాణం - పొద్దున్నే లేచి వాటిని చూడకపోతే రోజు గడవదు'

Farmers Request to govt To Focus On Nursery Problems :నర్సరీలకు అందించే రాయితీ, డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలను మూడేళ్లుగా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నర్సరీల నిర్వహణే కష్టంగా మారిందని తమకు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. నర్సరీల్లో మెుక్క అంటుకట్టే దగ్గర నుంచి ఎదిగే వరకు ఈ నర్సరీల ద్వారా ఉపాధిని పొందుతున్న కూలీల పాత్ర కీలకమైనది. తమకు రోజూ రూ.350 కూలీ ఇస్తున్నారని చెబుతున్నారు. కానీ నిర్వహణ కష్టంగా మారడంతో ఆ భారం తమపై పడుతుందేమోనని కూలీలు ఆవేదన చెందుతున్నారు.

"మేము జామ, బత్తాయి, నిమ్మ, రోడ్​ డివైడర్​లో పెట్టే అన్ని రకాల మొక్కలను అమ్ముతాము. ఈ చుట్టుపక్కల దాదాపు 2 వందల నర్సరీలు ఉంటాయి. ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వక ఉపాధి కోల్పోతున్నాం. రైతులు ఎవ్వరూ మొక్కలు నాటుకోడానికి ముందుకు రావడం లేదు. గత నాలుగైదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ రాయితీ ఇవ్వకపోవడం వల్ల రైతులు చాలా నష్టాల్లో ఉన్నారు. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాల వారు వచ్చి పండ్ల మొక్కలు తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు మార్కెట్ లేకపోవడంతో చాలా నష్టాల్లో ఉన్నాం."- రైతులు

దయనీయంగా నర్సరీ రైతులు పరిస్థితి ప్రభుత్వ రాయితీ కల్పించాలంటూ ఆవేదన

Grand Nursery Mela: నర్సరీ మేళాకు విశేష స్పందన.. నేటితో ముగియనున్న ప్రదర్శన..

మొక్కలను కుండీలోకి మార్చే క్రమంలో వాటి కవర్లను అక్కడే పడేస్తుంటారు. అది భూమిలో కలవకుండా పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ఆ కవర్లను ఇటుక బట్టిలో మంటకోసం వినియోగిస్తున్నారు. దీంతో పర్యావరణాన్ని రక్షించడంలో తమవంతు పాత్ర పోషిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం మొక్కలను తీసుకెళ్తున్నారు. వాటి ధరలు కూడా సాధారణంగానే ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమకు రాయితీలు కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

మొక్కలతో మానసిక ఉల్లాసం, గ్రాండ్ నర్సరీ మేళాలో హరీశ్ రావు

ABOUT THE AUTHOR

...view details