తెలంగాణ

telangana

ETV Bharat / state

బూడిద తరలింపులో నామమాత్రపు రుసుములు! - చర్చనీయాంశంగా మారిన ఎన్టీపీసీ బూడిద తరలింపు - NTPC Ash Transported Illegally

NTPC Ash Transported Illegally : ఎన్టీపీసీ నుంచి వెలువడే బూడిద తరలింపు అంశం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్లాంటు నుంచి వెలువడే వృథా అని చెప్పిన అధికారులు బూడిదను వినియోగంలోకి తీసుకొచ్చామని ప్రకటించారు. అయితే బూడిద తరలింపులో నామమాత్రపు రుసుము వసూలు చేస్తున్నారని అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

MLA Koushik Reddy Comments On NTPC Ash
NTPC Ash Transported Illegally (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 7:08 PM IST

చర్చనీయాంశంగా మారిన ఎన్టీపీసీ బూడిద తరలింపు (ETV Bharat)

NTPC Ash Transported Illegally : రామగుండంలోని బొగ్గు ఆధారిత ఎన్టీపీసీ విద్యుత్తు పరిశ్రమ నుంచి వెలువడే తడి, పొడి బూడిదను అంతర్గాం మండలం కుందనపల్లిలోని ప్రత్యేక చెరువులో నింపుతారు. 500 ఎకరాల్లో ఉన్న ఈ చెరువులో ప్రతి రోజూ టన్నుల కొద్దీ బూడిదను డంప్‌ చేస్తారు. ఇక్కడి బూడిదను రహదారుల నిర్మాణానికి, ఇటుకల తయారీకి వినియోగిస్తారు. బూడిదను ఎప్పటికప్పుడు తరలించేందుకు టెండర్లు పిలుస్తారు. కాగా లారీలో గరిష్ఠంగా 32 టన్నుల బూడిదను తీసుకెళ్లాల్సి ఉండగా పక్కలకు చెక్కలు కట్టి అదనంగా మరో 15-20 టన్నులు రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

MLA Koushik Reddy Comments On NTPC Fly Ash: నంబరు ప్లేటు లేని వాహనాల్లో యథేచ్ఛగా తరలిస్తూ కొందరు అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టు ఏజెన్సీ మాత్రం లారీల్లో తరలిస్తున్న బూడిదకు వెయిమెంట్ ఆధారంగానే బిల్లులు ఇస్తుండడంతో పరోక్షంగా రవాణా శాఖ నిబంధనలను ఉల్లంఘించినట్టుగా స్పష్టం అవుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.

"ఎన్టీపీసీలో కొందరు కాంగ్రెస్ నాయకులు బూడిద అవినీతికి పాల్పడుతున్నారు. లారీలో గరిష్ఠంగా 32 టన్నుల బూడిదను తీసుకెళ్లాల్సి ఉండగా, అదనంగా 15 నుంచి 20 టన్నులు రవాణా చేస్తున్నారు. దీంట్లో వచ్చిన డబ్బును రూ.50 లక్షలు మంత్రికి ఇస్తున్నారు." -పాడి కౌశిక్‌ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Ramagundam NTPC Power generation : ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.. ఉత్పత్తి మరిచారు..!

NTPC Ash Problems :రామగుండం నుంచి రాజీవ్‌ రహదారి సహా హుజూరాబాద్, వరంగల్‌ మార్గంలో నిత్యం వివిధ జిల్లాలకు పెద్ద ఎత్తున బూడిద రవాణా జరుగుతోంది. రాత్రింబవళ్లు వందలాది వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. లారీలు తరుచుగా తిరుగుతుండటంతో పలు చోట్ల రహదారులు ధ్వంసమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మోతాదు కంటే అధిక పరిమాణంలో బూడిద సరఫరా చేస్తుండటంతో లారీల వెనుక ప్రయాణించే ద్విచక్రవాహనదారులు అవస్థలు పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే బూడిద తరలింపు వ్యవహారంపై రవాణా శాఖ అధికారులు పక్కాగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. తరలింపు కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు రోజూవారీగా ఎన్ని వాహనాలు వెళ్తున్నాయనే విషయమై వివరాలు పక్కాగా ఉంటేనే బూడిద రవాణా ప్రక్రియ పారదర్శకంగా సాగే వీలుంటుందని ప్రజలు అంటున్నారు.

ఇంజినీరింగ్ అర్హతతో NTPCలో 110 డిప్యూటీ మేనేజర్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

NTPC Engineering Jobs 2023 : గేట్ స్కోర్​తో.. 495 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ జాబ్స్​.. అప్లై చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details