Notices to Telangana Minister Konda Surekha :తెలంగాణమంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.
తన కుటుంబంతో పాటు, కుమారుడు నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాజకీయ విమర్శల్లో భాగంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ నాగార్జున, నాగచైతన్య, సమంతల పేర్లను ప్రస్తావించారు. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.
కొండా సురేఖ వ్యాఖ్యలతో తీవ్ర మనోవేదనకు గురయ్యాం - హీరో నాగార్జున వాంగ్మూలం