తెలంగాణ

telangana

ETV Bharat / state

జనాలు లేక వెలవెల బోయిన జగన్ బస్సుయాత్ర - ఎండలోనే కొద్దిపాటి జనం - CM Jagan Bus Yatra - CM JAGAN BUS YATRA

No Response from People to CM Jagan Bus Yatra: తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర వెలవెల బోయింది. ఈ సభకు ప్రజలు స్వల్పంగా మాత్రమే హాజరయ్యారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రజలు ఎండలో అవస్థలు పడ్డారు. సీఎం జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో రాకపోకలు నిలుపుదల చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు.

AP politics 2024
CM Jagan Bus Yatra

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 8:01 PM IST

జనాలు లేక వెలవెల బోయిన జగన్ బస్సుయాత్ర - ఎండలోనే కొద్దిపాటి జనం

No Response from People to CM Jagan Bus Yatra: ఆంధ్రప్రదేశ్​లోనితూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఎస్టీ రాజాపురం శివారు నుంచి సీఎం జగన్​ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రంగంపేట మండలం వడిసలేరు చేరుకునేసరికి సీఎం జగన్ బస్సు యాత్రకి జనాదరణ కరవైంది. ఈ యాత్రలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వచ్చిన ఆ కొంత మంది ప్రజలు ఎండలో అవస్థలు పడ్డారు. సీఎం జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలను పోలీసులు నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

బలవంతంగా తరలింపు :సీఎం జగన్​ సభలకు, దారి పొడువునా ప్రజలను పోగు చేయడానికి వైసీపీ నాయకులు నానాఅవస్థలు పడుతున్నారు. జగన్​ బహిరంగ సభలకు జనాన్ని పార్టీ శ్రేణులు బలవంతంగా తరలిస్తుంటే, మరికొంత మంది డబ్బు, మద్యం ఆశ చూపి జనాన్ని పోగు చేస్తున్నారు. ఇంకా కొందరు అయితే జగన్​ సభలకు రాని వారిపై దాడులు కూడా చేస్తున్నారు. జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారు అంటేనే స్థానికులు భయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details