No Changes in Telangana DSC Exam Dates : తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఉంటాయని ప్రకటించింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి పాఠశాల విద్య అధికారిక వెబ్సైట్లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
డీఎస్సీని కంప్యూటర్ టెస్డ్గా నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న సుమారు 11,062 పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చ్ 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించిన విద్యాశాఖ, ఈ నెల 18 నుంచి కంప్యూటర్ ద్వారా పరీక్ష నిర్వహించనుంది.
DSC Candidates Protest In Hyderabad :మరోవైపు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు హైదరాబాద్‌లో ఇవాళ ఆందోళనకు దిగారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలా వెంకటేశ్ ఆధ్వర్యంలో లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. డీఎడ్, బీఎడ్, నిరుద్యోగులు గత కొన్ని ఏళ్లుగా డీఎస్సీ కోసం సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు.