No Bengaluru Like Water Crisis in Hyderabad : హైదరాబాద్ మహానగర ప్రజల తాగునీటి అవసరం కోసం రిజర్వాయర్లలో ఏడాదికి సరిపడా నీటి నిల్వలున్నాయని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు. నగరంలో నీటి సరఫరా, ట్యాంకర్ల డిమాండ్‌పై ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ సుదర్శన్ రెడ్డి సమక్షంలో సీజీఎంలు, జీఎంలతో సమీక్ష నిర్వహించిన దాన కిషోర్ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
డివిజన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్ల డిమాండ్‌పై వివరాలు ఆరా తీసిన దాన కిషోర్ జల మండలి సర్వే చేసిన 1700 ఇళ్లల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్లే ఆయా ప్రాంతాల్లో నీటి కొరత తలెత్తిందని స్పష్టం చేశారు. మార్చిలోనే భూగర్భ జలాలు నిండుకోవడం వల్ల ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం ఆలస్యమవుతుందని వివరించారు. 12 గంటల్లో నీళ్లు అందించేందుకు వెయ్యి ట్యాంకర్లను పెంచుతున్నామని, రవాణా శాఖ సహకారంతో కొత్త ట్యాంకర్ షెల్స్‌ను కూడా తయారు చేయిస్తున్నట్లు దాన కిషోర్ వెల్లడించారు.
ఈ వేసవికి ఢోకా లేదు - భాగ్యనగరవాసులకు ప్రభుత్వం భరోసా - hyderabad Water board
No Water Problems in Hyderabad : అయితే బెంగళూరు లాంటి పరిస్థితి హైదరాబాద్ లో లేదని స్పష్టం చేశారు. జలమండలి సరఫరా చేసే నీటిలో 96 శాతం తాగునీటి అవసరాలకే వెళ్తోందని, మిగిలిన 4 శాతం మాత్రమే వాణిజ్య అవసరాలకు సరఫరా అవుతుందని దాన కిషోర్ వివరించారు. ప్రజల తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్న దాన కిషోర్ నాగార్జున సాగర్‌లో అవసరమైతే ప్రత్యేక బార్జ్ ఏర్పాటు చేసి ఏడాదంతా నీటి సరఫరా చేస్తామన్నారు.