వెలుగులోకి నిజాం కాలంనాటి పెట్రోల్ పంపు - ఎక్కడో తెలుసా? Nizams Personal Petrol Pump in KBR Park :రాష్ట్రంలో పురాతన చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఔరా అనే అనేక కళాకృతులు ఉన్నాయి. ఆనాడు వారు వాడిన వస్తువులు నేటికీ మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వీటిని చూసినప్పుడుల్లా ఆనాటి జీవన విధానాలు, సాంఘిక పరిస్థితులు గుర్తుకువస్తాయి. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ పార్కులో ఇటీవల గుర్తించిన పురాతన పెట్రోల్ పంప్ చర్చనీయాశంగా మారింది. దీని పూర్తి సమాచారం తెలుసుకునేందుకు నెటిజన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు చెట్ల పొదల్లో ఉన్న ఈ పెట్రోల్ పంప్, చెట్లు ఎండిపోవడంతో బయట పడింది. నగర ప్రజలు నిత్యం వాకింగ్ కోసం ఈ ఉద్యానవనానికి వస్తున్నా ఎవరూ దీనిని గమనించలేదు.
Nizams Personal Petrol Pump Found Hyderabad :తాజాగాఅల్లూరి రాజు అనే వ్యక్తి దీనిని గుర్తించి ఫొటోలు తీసి, వివరాలు తెలుసుకుని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. గత సంపదకుఇదే సాక్ష్యం అంటూ ఆయన తన ఖాతాలో పేర్కొన్నారు. దీంతో ఇది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో ఇప్పుడు ఇక్కడి పెట్రోల్ పంపును చూడటానికి నడకదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ మ్యూజియం.. అరుదైన నాణేల కొలువు.. ఆర్థిక చరిత్రకు నెలవు!
కేబీఆర్ పార్కు మొత్తం విస్తీర్ణం 142.5 హెక్టార్లు : మరోవైపు ఉద్యానవనంలోని మేనేజ్మెంట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు (KBR Park) మొత్తం విస్తీర్ణం 142.5 హెక్టార్లుగా ఉంది. ఇదంతా గతంలో నిజాం నవాబుల ఆధీనంలో ఉంది. దక్కన్ పీఠభూమి ప్రతిబింబించే శిలా సంపద పార్కులో ఉంది. కాగా 1960లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌లో భాగంగా దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందులోని 2.40హెక్టార్లను నిజాం అధీనంలోనే ఉంచింది.
Rock Museum In Hyderabad: 3.3 బిలియన్ ఏళ్ల పురాతన శిలలతో 'రాక్ మ్యూజియం'..
KBR Park in Hyderabad :ఇందులో 17 ప్రాంతాల్లో నిజాం నవాబులకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. అందులో 528.28 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ పెట్రోల్ పంప్ ఉంది. దీనిని నిజాంలు వారి వాహనాలు, ట్రక్కులకు ఇక్కడే రీఫిల్లింగ్ చేసేందుకు వాడేవారని తెలుస్తోంది. దీంతో పాటు గ్యారేజ్, పౌల్ట్రీ షెడ్, వర్క్‌షాప్ షెడ్, ధోబీ ఖానా, భోజన శాల, విలాస బంగ్లాలు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు ఆరు అవుట్ హౌస్‌లతో పాటు ఒక చిరాన్ ప్యాలెస్ ఉన్నాయి. బావులు, ట్యాంకులు ఇలా మొత్తం 17 ప్రాంతాలకు సంబంధించినవి ఉన్నట్లు ప్లాన్‌లో వివరించారు. అయితే ప్రధానంగా వినిపిస్తున్న పెట్రోల్ పంప్ 1950-60 మధ్య కాలంలో వినియోగించే వారని తెలుస్తోంది. ఈ పంప్ బెక్‌మీటర్ కంపెనీకి చెందినదిగా సమాచారం. పంప్‌పై ఉన్న మీటర్ గ్యాలన్ రీడింగ్ ఉండటంతో దీనికి బలం చేకూరుతోంది.
Antiques Collecting Person: అతని ఇల్లే మ్యూజియం.. కనువిందు చేస్తున్న పురాతన వస్తువులు