Niti Aayog CEO BVR Subramanyam Meets CM Chandrababu Naidu : స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ - 2047 (Swarnandhra Vision Document 2047)కు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం సమావేశం అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో నీతి ఆయోగ్‌కు సంబంధించిన సలహాదారు, డైరెక్టర్లతో పాటు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేలా కార్యాచరణ :కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ చోటు చేసుకుంది. ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధన లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ప్రణాళిక రూపొందించినట్టు సీఎం చంద్రబాబు వివరించారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీ అభివృద్ధి లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో రూపొందించినట్టు సీఎం స్పష్టం చేశారు.