Nirudyoga Bruthi Scheme: ఎన్నికల హామీల్లో మరో అంశాన్ని నెరవేర్చుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేదాధ్యయనం పూర్తి చేసి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు 3 వేల రూపాయల చొప్పున సంభావన రూపంలో నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
వారందరికీ 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి - ప్రభుత్వం ఉత్తర్వులు - NIRUDYOGA BRUTHI SCHEME
ఎన్నికల హామీలో మరో అంశాన్ని నెరవేర్చుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు - నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయం
Nirudyoga Bruthi Scheme (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 31, 2024, 10:25 AM IST
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7 దేవాలయాల పరిధిలో మొత్తం 600 మంది వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయిస్థూ ఉత్తర్వులలో పేర్కొంది. సింహాచలం, అన్నవరం, కనకదుర్గ ఆలయం, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం ఆలయాల్లో వేదాధ్యయనం చేసిన పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.