Night Engineering Colleges for Working People : ఓ వయసు వచ్చాక ఉద్యోగం తప్పనిసరి. కానీ అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు కదా ! కాలేజీలో చేరి ఉద్యోగం చూసుకుంటారు కొందరు. అలాంటి వారు కాలేజీలకు వెళ్లడానికి, చదువుకునేందుకు, పరీక్షలు రాయడానికి సమయం దొరకదు. ఇలా మొదటి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జాయిన అయిన వాళ్లు ఉద్యోగం చేస్తూ కోర్సులను పూర్తి చెయ్యలేకపోతున్నారు. అలాంటి వారిలో ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధిన వారే అధికంగా ఉన్నారంట. అలాంటి వారి కోసం ఏఐసీటీఈ ప్రత్యేక వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది.
పగటి పూట చదువుకోవడానికి వీలు పడని వారి కోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) రాత్రి వేళల్లో డిప్లొమా, బీటెక్, ఎంటెక్ కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 కళాశాలలకు అనుమతులు ఇచ్చింది. గత మూడేళ్లుగా మొదటి సంవత్సరంలో 80 శాతం సీట్లు భర్తీ అవుతున్న కళాశాలలు, యాస్పిరేషనల్ జిల్లాల్లో ఉన్న కళాశాలల్లో ఈ కోర్సులను ప్రవేశ పెట్టేందుకు ఏఐసీటీఈ (AICTE) ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 8 కళాశాలల్లో 3 కోర్సులకు అనుమతులు ఇవ్వగా మరో ఎనిమిదింటిల్లో 2, ఒక కళాశాలలో ఒక్క కోర్సుకు అనుమతులు లభించాయి. మొత్తం 41 కోర్సుల్లో 1,230 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లోనూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులే ఎక్కువగా ఉన్నాయి.
AICTE Acccepted For Night Colleges For Engeneering Students : సీఎస్‌ఈ కృత్రిమ మేధ-మెషీన్ లెర్నింగ్ (AI), కంప్యూటర్ సైన్సు ఇంజినీరింగ్ (Computer Engineering) , మెకానికల్ (Mechanical), సివిల్ (civil), ఈసీఈ (ECE), ఈఈఈ (EEE) కోర్సులు ఉన్నాయి. రెగ్యులర్‌లో బ్రాంచికి 60 సీట్లు కాగా దీనికి సంబంధించి ఒక్కో బ్రాంచికి 30 సీట్లకు ఏఐసీటీఈ అనుమతులు ఇచ్చింది. కొత్తగా వచ్చిన ఈ కోర్సులు, కళాశాలల నిర్వహణ, సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. వీటిని ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ తర్వాత విశ్వవిద్యాలయాలు (Central Universities) అనుమతులు ఇస్తాయి.