Hyderabad Vijayawada Highway Toll Fee Collection :హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటోల్‌ప్లాజాల వద్ద టోల్ వసూళ్లు చేసే బాధ్యతను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తాజాగా మూడు ఏజెన్సీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ జాతీయ రహదారిపై 2012 డిసెంబరు నుంచి టోల్ వసూళ్లను ప్రారంభించిన జీఎమ్మార్ సంస్థ నిర్దేశిత గడువు(2025 జూన్)కు ఏడాది ముందే టోల్ వసూళ్ల బాధ్యతతో పాటు హైవే నిర్వహణ నుంచి తప్పుకొంది.
ఈ నేపథ్యంలోనే జాతీయరహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) జులై నుంచి సెప్టెంబరు వరకు మూడు మాసాల పాటు టోల్ వసూళ్ల నిర్వహణను తాత్కాలికంగా రెండు ఏజెన్సీలకు అప్పగించింది. పంతంగి, కొర్లపహాడ్ వద్ద టోల్ వసూళ్ల బాధ్యత స్కైలాబ్ ఇన్‌ఫ్రా, చిల్లకల్లు వద్ద కోరల్ ఇన్‌ఫ్రా సంస్థ ఈ బాధ్యతను చూసుకుంది. వీటి గడువు ముగియడం వల్ల తాజాగా 3 నూతన ఏజెన్సీలకు ఏడాది పాటు ఆ బాధ్యతను అప్పగిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది.