ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హంద్రీ వంతెనపై భారీ గొయ్యి - వాహనదారులు ఆందోళన - Handri bridge

Huge pothole on Handri bridge in Kurnool District : దశాబ్దాల క్రితం హంద్రీ నదిపై నిర్మించిన వంతెనపై గోతులు ఏర్పడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. కొంత వంతెన నిర్మించాలని కోరుకుంటున్నారు.

handri_bridge
handri_bridge (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 7:06 AM IST

Updated : Jul 23, 2024, 8:51 AM IST

Huge pothole on Handri bridge in Kurnool District : జాతీయ రహదారి 44 అంటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. పెద్దఎత్తున రాకపోకలు సాగించే రహదారికి కర్నూలు నగరంలో ప్రమాదం పొంచి ఉండటంతో జనం భయాందోళన చెందుతున్నారు.

అమరావతిలో మరో రెండు రాచబాటలు - సీఆర్​డీఏ తాజా ప్రతిపాదన - Amaravathi National Highways

దశాబ్దాల క్రితం వంతెన నిర్మాణం : కర్నూలు మీదుగా వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారి శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. ఈ అతిపెద్ద జాతీయ మార్గంపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ వంటి మహానగరాలకు ఎన్నో వాహనాలు వెళ్తాంటాయి. ఈ మార్గం కోసం దశాబ్దాల క్రితం కర్నూలులోని హంద్రీ నదిపై వంతెన నిర్మించారు. ఇది గత కొంతకాలంగా ప్రమాదకరంగా మారటంతో జాతీయ రహదారుల సంస్థ మూడు నెలల క్రితం మరమ్మతులు చేసింది. కర్నూలులో ఇటీవల కురిసిన వర్షాలకు హంద్రీ వంతెన మరింత ప్రమాదకరంగా మారింది.

రాష్ట్రంలో హైవేల విస్తరణకు కేంద్రం గ్రీన్​సిగ్నల్- రూ.2 లక్షల కోట్లతో పచ్చజెండా - 8 National Highways Expansion

భారీ గొయ్యి : హంద్రీ వంతెన మధ్యలో భారీ గొయ్యి ఏర్పడింది. దాని వల్ల వాహన రాకపోకలను ఒకవైపు ఆపేశారు. మరోవైపు ఇంకో గొయ్యి ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను నియంత్రిస్తున్నారు. దీని వల్ల కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోతోంది. ఫలితంగా వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 6 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన స్థానంలో కొత్తది నిర్మించాలని కర్నూలు ప్రజలు కోరుతున్నారు.

"కర్నూలు నగరంలోని హంద్రీ బ్రిడ్జి మీద చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. 6 నెలలు క్రితం అధికారులు బ్రిడ్జిపై మరమ్మతులు చేశారు. చేసి మూడు నెలలు కూడా కాలేదు అంతలో మళ్లీ గుంతలు పడ్డాయి. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం"_ వాహనదారులు

హైదరాబాద్‌-బెంగళూరు హైవే విస్తరణ - రాయలసీమకు మహర్దశ - Hyderabad Bangalore Highway

Last Updated : Jul 23, 2024, 8:51 AM IST

ABOUT THE AUTHOR

...view details