New Year Events Organizers Should Take Permission From Police : కొత్త సంవత్సరం వేడుకలకు యువత ముందుగానే ప్లాన్స్ చేసుకుంటుంటారు. ఎక్కడికి వెళ్లాలి? ఎలా జరుపుకోవాలి? అంటూ పెద్ద జాబితా సిద్ధం చేసుకుంటుంచారు. కొత్త సంవత్సరం వస్తుందంటే యువతే కాదు దంపతులు, పిల్లలు, ఎవరికి వారి ప్లానింగ్స్ ఉంటాయి. కొంతమంది కుటుంబ సభ్యులతో, మరికొందరు ఫ్రెండ్స్‌తో, కొందరు ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటుంటారు. మరికొంతమంది ఔటింగ్ ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈవెంట్స్‌కి వెళ్లి, హాయిగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలి అని అనుకునే వారు చాలా మందే ఉంటారు. ఇలా అందరినీ దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో ఈవెంట్స్ ఏర్పాటు చేస్తుంటారు.
న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారా? - ఈ అనుమతులు మస్ట్ - 15 వరకే ఛాన్స్ - NEW YEAR EVENT PERMISSION
న్యూ ఇయర్ ఈవెంట్లకు అనుమతి తప్పనిసరి - వచ్చే నెల 15వ తేదీ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - వెల్లడించిన సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి
Published : Nov 29, 2024, 5:25 PM IST
|Updated : Nov 29, 2024, 6:05 PM IST
అయితే అలాంటి ఈవెంట్లు ఏర్పాటు చేసే నిర్వాహకులు కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి అంటున్నారు సైబరాబాద్ పోలీసులు. ఈవెంట్లు ఏర్పాటు చేయడానికి వచ్చే నెల 15లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. https://cybpms.telangana.gov.in/ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సైబరాబాద్‌తో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ ఈవెంట్ ఏర్పాటు చేయాలన్నా సంబంధిత ఠాణా నుంచి పర్మిషన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఈవెంట్లు ఏర్పాటు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.