తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్రాంతి కానుకగా కొత్త రేషన్​ కార్డులు - వచ్చే నెల 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఏపీలో సంక్రాంతి కానుకగా కొత్త రేషన్‌ కార్డులు - డిసెంబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ - విభజన, మార్పులు, చేర్పులకూ అవకాశం

RATION CARDS FROM SANKRANTI IN AP
New Ration Cards In AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2024, 11:11 AM IST

New Ration Cards In AP: ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరుతో పాటు, ఉన్న వాటి సవరణకు అవకాశం కల్పిస్తూ డిసెంబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులకు పింఛను మంజూరు చేయాలన్నా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలన్నా, దీపం-2 పథకం వర్తింపజేయాలన్నా ప్రాథమికంగా బియ్యం కార్డు కలిగి ఉండాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇవి తప్పకుండా ఉండాలి.

నాడు ఉన్నవీ తొలగించారు : ఇంతటి కీలకమైన కార్డుల మంజూరును గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులకూ అవకాశం ఇవ్వకపోవడంతో వేలాది మంది సంక్షేమ పథకాల లబ్ధికి దూరమయ్యారు. ఈ తప్పిదాన్ని సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే ఉన్న పాత కార్డులను కాదని అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చిత్రాలు, ఆ పార్టీ గుర్తులతో ముద్రించి ఇచ్చారు. ఇందుకోసం చాలా డబ్బులు వృథా చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

అప్పట్లో కొత్త కార్డులు కావాల్సినవారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అయిదు రోజుల్లోనే మంజూరు చేస్తామని గొప్పగా చెప్పారు. కొత్తవి ఇవ్వకపోగా ఆరంచెల విధానంలో వడపోసి అప్పటికే ఉన్న కార్డులను తొలగించారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వివాహం జరిగితే విభజన చేసుకునేందుకూ అనుమతి ఇవ్వలేదు. పేర్ల తొలగింపు, చేర్పులకు అవకాశం లేకుండా పోయింది. దీంతో అప్పట్లో ప్రభుత్వ సంక్షేమ, రాయితీ పథకాలేకపోయారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంతో బియ్యం కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నేడు అర్హులందరికీ అవకాశం : లబ్ధిదారుల అవస్థలు గుర్తించిన కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారం దిశగా ప్రణాళికలు వేస్తుంది. కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులో మార్పులు, చేర్పుల కోసం వచ్చే నెల 2 నుంచి 28 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హులను గుర్తించి సంక్రాంతి పండగ కానుకగా వాటిని ఇవ్వాలనుకుంటుంది. దీంతో వేలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు సంక్షేమ, రాయితీ పధకాలు పొందుతారు. ఇప్పటికే గత సీఎం చిత్రం, వైసీపీ రంగులతో ముద్రించిన చక్కెర, కందిపప్పు ప్యాకింగ్‌ను మార్చారు. కార్డుల రంగులను కూడా మార్చి కొత్తవి అందజేస్తారు. ఈ విషయమై డీఎస్వో పద్మశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులందరికీ కార్డులు మంజూరుతో పాటు, మార్పులు చేర్పులు చేస్తామని తెలిపారు.

తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు - ఆదాయం ఎంతలోపు ఉండాలి? - New Ration Card in Telangana

కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారా? - ఐతే మీకో గుడ్ న్యూస్

ABOUT THE AUTHOR

...view details