తెలంగాణ

telangana

ETV Bharat / state

వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు - ఎలాగో తెలుసా? - new criminal laws Implementation - NEW CRIMINAL LAWS IMPLEMENTATION

Police Complaint Through Whatsapp : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నేర, న్యాయ చట్టాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు, దర్యాప్తు స్థితి తదితర అంశాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్, సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాయి.

New Criminal Laws In India 2024
New Criminal Laws In India 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 10:20 AM IST

Updated : Jul 2, 2024, 10:28 AM IST

New Criminal Laws In India 2024 :కేసు నమోదు చేసినా, బాధితుల చేతికి ఎఫ్‌ఐఆర్‌ వచ్చేందుకు రోజుల తరబడి ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఉండేది. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉంది, నిందితుల్ని అరెస్టు చేశారా లేదా? అనే విషయం తెలియని పరిస్థితి ఉండేది. పోలీస్​సేష్టన్​కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చినా కేసు నమోదు చేసేందుకు తాత్సారం చేసేవారు. అయితే, ఇలాంటి జాప్యానికి కొత్త నేర, న్యాయ చట్టాలు సరైన పరిష్కారాలు చూపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు అత్యవసర పరిస్థితుల్లో వాట్సాప్, ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించాయి. ఇంతవరకూ అమల్లో ఉన్న ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అథినీయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మూడు చట్టాలు బాధితుల ఫిర్యాదు, కేసు సమాచారం విషయంలో ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా ఉన్నాయి.

మూడు క్రిమినల్​ బిల్లులకు లోక్​సభ ఆమోదం- బ్రిటిష్ కాలంనాటి సెక్షన్లకు చెక్!

ఫిర్యాదు ఎలాగైనా పంపొచ్చు

ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్, సామాజిక మాధ్యమ వేదికలు, వెబ్‌సైట్లు తదితర డిజిటల్‌ రూపంలో బాధితులు ఫిర్యాదు ఇవ్వొచ్చు.
ఈ ఫిర్యాదులను పోలీసులు దీన్ని జనరల్‌ డైరీలో నమోదు చేస్తారు. అనంతరం తర్వాత బాధితుడు, వ్యక్తి మూడురోజుల్లోగా ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధిచిన సమాచారం ఇస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు.

  • సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్‌ విధానంలో పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలంటే ఎస్‌హెచ్‌వో అధికారిక ఈ-మెయిల్, ఫోన్‌ నెంబరుకు పంపిస్తే మంచిది.
  • అపహరణ, బెదిరింపులులాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీస్‌స్టేషన్‌కు రాలేని సందర్భాల్లో, ఫోన్‌ చేస్తే సంబంధిత ఠాణా పోలీసులు బాధితుల్ని రక్షించి వారికి తగిన సాహాయం చేయాలి. ఠాణా పరిధి కాకపోతే, సంబంధించిన అధికారులకు సమాచారం అందించాలి.
  • ప్రత్యేక పరిస్థితుల్లో ఫిర్యాదుదాడి నుండి సంతకం తీసుకోలేని పరిస్థితి ఉంటే, అతని బంధువులు, నేరం గురించి తెలిసిన వ్యక్తి నుంచి కూడా సంతకం తీసుకోవచ్చు.

దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలుసుకునే వెసులుబాటు

  • కేసు నమోదు చేసిన తర్వాత బాధితులకు లేదా ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తికి ఎఫ్‌ఐఆర్‌ ప్రతి ఉచితంగా అందించాలి.
  • ఒక కేసు నమోదైన తర్వాత నేర బాధితుడికి, 90 రోజుల్లో దర్యాప్తు పురోగతిని అధికారులు డిజిటల్‌ రూపంలో ఇవ్వాలి. లేదా ఇతర విధానంలోనైనా కచ్చితంగా ఇవ్వాలి. కేసు దర్యాప్తు 90 రోజుల్లో పూర్తవ్వకపోయినా అప్పటి పరిస్థితి ఏంటో అతనికి తెలియజేయాలి.
  • ఏదైనా కేసులో 90 రోజుల్లో దర్యాప్తు పూర్తయితే, ఎలక్ట్రానిక్‌ విధానంలో మెజిస్ట్రేటు దగ్గర దాఖలు చేసిన నివేదిక ప్రతిని బాధితుడు/ సమాచారం ఇచ్చిన వ్యక్తికి సైతం పంపాలి. ఒక కేసులో బాధితులు ఎంతమంది ఉంటే వారందరికీ ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఏదైనా ఘటన జరిగినప్పుడు దర్యాప్తు అధికారి బాధ్యులపై ఏం చర్య తీసుకున్నారో సమాచారం ఇచ్చిన వ్యక్తికి కచ్చితంగా తెలియజేయాలి.

ఫిర్యాదు తీసుకోకపోతే ఏం చేయాలి?

  • బీఎన్‌ఎస్‌స్‌ సెక్షన్‌ 173 సబ్‌ సెక్షన్‌ ప్రకారం, పౌరులకు ఒక నేరం గురించి గానీ, ఘటన గురించి సమాచారం తెలిసినప్పుడు సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారి, ఎస్పీ కేసు రిజిస్టర్‌ చేయనప్పుడు న్యాయమూర్తిని కలిసి చెప్పొచ్చు. ఇందుకు ప్రత్యేక దరఖాస్తు విధానాన్ని తీసుకువచ్చారు.
  • జీరో ఎఫ్‌ఐఆర్‌ను జాతీయ స్థాయిలో మరింతగా విస్తృతం చేశారు. ఏ రాష్ట్రంలో ఫిర్యాదు చేసినా సంబంధిత పరిధి స్టేషన్​కు పంపేలా మార్పులు తీసుకువచ్చారు.
  • పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని చట్టంలో పేర్కొన్నారు.

అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు- ఇకపై ఆ నేరాలకు పాల్పడితే అంతే సంగతి! - New Criminal Laws In India 2024

Last Updated : Jul 2, 2024, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details