తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏఐతో సరికొత్త కళ్లజోడు - అంధులకు కోసం ప్రత్యేకంగా తయారీ - ARTIFICIAL INTELLIGENCE SPECS

అంధ విద్యార్థులు, వృత్తి నిపుణుల కోసం ఏఐ కళ్లద్దాలు - త్వరలోనే ఇండియాలో కూడా అందుబాటులోకి రానున్న స్మార్ట్​ కళ్లద్దాలు

ARTIFICIAL INTELLIGENCE SPECS
కృత్రిమ మేధతో సరికొత్త కళ్లజోడు (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2024, 2:41 PM IST

AI Specs For Blind Persons : అంధులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ (కృత్రిమ మేధ) కొత్త స్నేహితుడిగా మారుతోంది. ఏఐ సాంకేతికతతో వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన కళ్లద్దాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఎదురుగా వస్తున్న వ్యక్తులెవరో చెప్పడంతోపాటు, ఎదురుగా వచ్చే వాహనాల గురించి అప్రమత్తం చేస్తూ ప్రమాదాల నుంచి రక్షిణ పరంగా సాయపడనుంది. ఎక్కడికైనా వెళ్లాలనుకునే ప్రాంతానికి దారి చెబుతూ మార్గనిర్దేశం చేస్తూ నడిపిస్తుంది. అంధ విద్యార్థులు, వృత్తి నిపుణుల కోసం ఏఐ సాయంతో వినూత్న ఆవిష్కరణలు చేపట్టాలనే ధృడమైన సంకల్పంతో మెటా-రేబాన్‌ సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేసి నాలుగు నెలల కిందట ఈ ఏఐ స్మార్ట్‌ కళ్లద్దాలను అందుబాటులోకి తెచ్చాయి. ప్రస్తుతం యూరప్​, అమెరికాల్లో మాత్రమే ఇవి పరిమితంగా లభిస్తున్నాయి. త్వరలోనే ఇండియాలో కూడా అందుబాటులోకి రానున్నాయి.

సెల్‌ఫోన్‌తో అనుసంధానం : మనిషికి మంచి ప్రతిభ ఉన్నా సరే చూపులేకపోవడం తన ఎదుగుదలకు పెద్ద అవరోధమే. చూపులేని కారణంగా విద్యార్థులు, వృత్తి నిపుణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. పూర్వం కేవలం బ్రెయిలీ లిపిలోనే చదువుకోవాల్సి వచ్చేది. ఇప్పటికీ అక్కడక్కడా ఇదే పద్దతి కొనసాగుతుంది. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు వచ్చాక వారి సమస్యలు కొంత మేర క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీనిని గమనించిన మెటా సంస్థ పరిశోధకులు కళ్లజోడుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమర్చి అందులోనే సెన్సర్లు, 12 ఎంపీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంధులు ఆ కళ్లద్దాలను ధరించిన వెంటనే వారి స్పర్శ(సెన్సర్) ద్వారా యాక్టివేట్‌ అయ్యేలా రూపొందించారు.

వాయిస్​ కమాండ్​తో మెసేజ్​లు : వాటిని సెల్‌ఫోన్‌కు కనెక్ట్​ చేస్తే అందులోని వివరాలు, ఫొటోల ఆధారంగా ఎదురుగా ఎవరు వస్తున్నారనే సమాచారం చెబుతాయి. అలాగే వాయిస్‌తో మెసేజ్‌లు, మెయిల్‌లు పంపుతుంది. అమెరికాలోని కాలిఫోర్నియా మెటా ప్రధాన కార్యాలయంలో ఇటీవల దాదాపు 300 మంది అంధ విద్యార్థులకు వీటిని ఇచ్చి ప్రయోగాత్మకంగా పనితీరును చూశారు. అనంతరం సత్ఫలితాలు రావడంతో ఏఐ కళ్లద్దాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం భారత కరెన్సీలో దీని ధర రూ.50 వేలు.

"అమెరికాలో ఈ స్మార్ట్‌ కళ్లద్దాలను వాడుతున్న నా స్నేహితులు బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. మొదటగా ఇజ్రాయెల్‌ పరిశోధకులు ఈ తరహా అద్దాలు తయారు చేశారు. కానీ అవి ఖరీదు చాలా ఎక్కువ. తాజాగా మెటా సంస్థ అందుబాటులో ఉండే ధరకే తీసుకొస్తోంది. త్వరలో గూగుల్‌ కూడా ఈ స్మార్ట్‌ కళ్లద్దాలను మార్కెట్‌లోకి తేనుంది. రాబోయే కాలంలో మంచి ఆవిష్కరణలతో అంధుల జీవితాలు చాలా సౌకర్యవంతంగా మారనున్నాయి"-డాక్టర్‌ అన్నవరం, హెచ్‌సీయూ సహాయ ఆచార్యులు

ఓపెన్​ఏఐ మరో అద్భుతం.. ఇకపై వాట్సాప్​తో పాటు ల్యాండ్​లైన్​లోనూ చాట్​జీపీటీ..!- ఎలా ఉపయోగించాలంటే?

భవిష్యత్ అంతా AI మయం- ఏ ప్రొడక్ట్‌ అయినా ఆ టెక్నాలజీతో నడవాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details