Nearly 200 Trains Cancelled Due to Cyclone Dana Effect : తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాను కారణంగా పులు రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అంతేకాకుండా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించాల్సి ఉన్న మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ మేరకు రద్దు చేసినవి, దారి మళ్లించినవి కలిపి సుమారు 200 సర్వీసులున్నాయని అధికారులు తెలిపారు. వీటన్నింటిని 23, 24, 25 తేదీల్లో రద్దు చేశారు.
రద్దు చేసిన రైల్వే సర్వీసులు వివరాలు ప్రయాణికులకు తెలియజేయడానికి రైల్వే సిబ్బంది విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, రాయగడ రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో 08912746330, 08912744619, 8712641255, 7780787054 నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
గంటకు 18 కి.మీ వేగంతో కదులుతున్న తుపాను
‘దానా’ తుపాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోందని వాాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ఇదితీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం ఉదయానికి ఒడిశాలోని పరదీప్‌కు 560 కి.మీ, పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి 630కి.మీ, బంగ్లాదేశ్‌లోని ఖేపురకు 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శనివారం వరకు ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశముందని వెల్లడించింది.
రద్దయిన రైళ్ల వివరాలివీ (ETV Bharat) రద్దయిన రైళ్ల వివరాలివీ (ETV Bharat) రద్దయిన రైళ్ల వివరాలివీ (ETV Bharat) రద్దయిన రైళ్ల వివరాలివీ (ETV Bharat) రద్దయిన రైళ్ల వివరాలివీ (ETV Bharat) హెల్ఫ్‌లైన్ నెంబర్లు (ETV Bharat) బంగాళాఖాతంలో అల్పపీడనం - రెండు రోజులు భారీ వర్షాలు - పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో తీవ్ర తుపాన్ - అన్ని పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక