ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 2:52 PM IST

Updated : Jun 11, 2024, 3:59 PM IST

ETV Bharat / state

ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీఏ నేతలకు గవర్నర్​ ఆహ్వానం- సీఎంగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం - NDA Leaders meet governor

NDA Leaders Letter To Governor On Cm Oath Occasion : ఎన్డీఎ కూటమి నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకుంటూ చేసిన తీర్మానం కాపీలను అచ్చెన్న, పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్‌ గవర్నర్‌కు అందజేశారు.

nda_leaders_letter_to_governor
nda_leaders_letter_to_governor (ETV Bharat)

NDA Leaders Letter To Governor On Cm Oath Occasion : ఎన్డీఏ కూటమి నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకుంటూ చేసిన తీర్మానం గవర్నర్‌కు అందజేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున అచ్చెన్నాయుడు, బీజేపీ తరఫున పురందేశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ గవర్నర్​ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ అందజేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూటమి నేతలను గవర్నర్​ ఆహ్వానించారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార మహోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు విచ్చేయనున్నారు. ప్రముఖుల రాక దృష్ట్యా భద్రత పెంచారు. విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా విమాన ప్రయాణికులకు ఎయిర్​పోర్టు అధికారులు ప్రత్యేక సూచనలు చేశారు. రేపు ఉ.10 నుంచి సా.4 వరకు విమానాశ్రయ పరిసరాల్లో ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ప్రయాణికుల విమానాలన్నీ యథాతథంగా నడుస్తాయని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. ఆంక్షల దృష్ట్యా ప్రయాణికులు ఉ.9.30లోపే విమానాశ్రయం చేరుకోవాలని ఆయన సూచించారు.

Last Updated : Jun 11, 2024, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details