NDA Government Will Introduce State Full Budget in November Month : రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను నవంబర్ 11న శాసనసభలో ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయార్జాన, బడ్జెట్ స్వరూపం, ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ , ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఆదాయార్జాన శాఖ అధికారులు హాజరయ్యారు.
నవంబరు రెండో వారంలో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్! - ‘సూపర్ సిక్స్’పై కసరత్తు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని అంశాలను సమీక్షించినట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) రాష్ట్ర రెవెన్యూ రూ.1,73,766 కోట్ల వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల ఆదాయం సాధించగలమా? ఇంతవరకు రాబడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అని సీఎం ప్రశ్నించారు.