Special Story On Biochar : దేశంలో హరిత విప్లవం నేపథ్యంలో ఆధునిక వ్యసాయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు అనేక రకాల పురుగు మందులు, రసాయనిక ఎరువులు విరివిగా వాడుతున్నారు. అధిక పంట దిగుబడుల పేరిట విచక్షణారహితంగా రసాయనాలు, క్రిమి సంహారకాలు వినియోగిస్తుండటంతో అవి మట్టి, నీళ్లలోనూ కలిసి పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్నాయి.
వెంటనే అరికట్టకపోతే భూమికి ఎంతో నష్టం కలిగిస్తుంది. అయితే వ్యవసాయ వ్యర్థాలు ఉపయోగించి సేంద్రీయ పద్ధతుల్లో పంటకు అవసరమయ్యే ఎన్నో పోషకాలు అందించవచ్చు. అటువంటి వ్యర్థాల నుంచి వచ్చిందే ఈ బయోచార్. ప్రపంచవ్యాప్తంగా బయోచార్ వినియోగం వ్యాప్తిగా ఉన్నప్పటికీ భారత్‌లో ఇప్పుడే బ్లాక్ విప్లవం దిశగా ప్రచారంలోకి వచ్చింది.
Conference On Biochar Manufacturing : తాజాగా హైదరాబాద్ యూసఫ్‌గూడలో జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థ – ఎమ్ఎస్ఎమ్ఈ సమావేశ మందిరంలో బయోచార్‌పై జాతీయ సదస్సు జరిగింది. ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీ, రెయిన్‌బో బాంబూ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు వేదికగా "బయోచార్ తయారీ పరికరాలు, ఉద్గారాలు" "వాతావరణ మార్పుల నేపథ్యంలో సవాళ్లు" వంటి అంశాలపై నిపుణులు, శాస్త్రవేత్తలు, కంపెనీల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు.
సాధారణంగా పంట కోతల అనంతరం వచ్చే వ్యర్థాలను తగులబెట్టకుండా అత్యాధునిక పరికరాలు ఉపయోగించి బయోచార్ తయారు చేసుకుని వాడుకోవచ్చని ప్రొగ్రెసివ్ బయోచార్ సొసైటీ ప్రతినిధులు సూచించారు.
వాతావరణ మార్పుల నేపథ్యంలో:ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారతదేశంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో తుపాన్లు, భారీ వర్షాలు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు, ఉష్ణతాపం పెరిగిపోతోన్నాయి. నేలల్లో కర్బన శాతం పడిపోయి సారం పూర్తిగా దెబ్బతింటుండటంతో ఉత్పత్తి స్తంభించిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇది గాలిలో ఉన్న కార్బన్‌ను భూమిలో నిక్షిప్తం చేయడం అనేది ఎంతోకాలంగా చేస్తోంది.