CBN TEAM OATH CEREMONY :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి కాగా, వేదికపై ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. అనంతరం మంత్రులుగా పవన్‌కల్యాణ్, నారా లోకేష్ ప్రమాణస్వీకారం చేశారు. కేసరపల్లిలో సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం జాతీయ గీతాలాపనతో వైభవంగా ప్రారంభమైంది. ప్రధాని మోదీ, చంద్రబాబు నాయడు గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా వేదికపైకి చేరుకున్నారు.
పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్‌ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బి.సి.జనార్దన్‌రెడ్డి, టీ.జీ.భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.