Nara Bhuvaneswari Thanks to CM Chandrababu for Buy Sarees :నేతన్నల జీవనోపాధికి మద్దతునిస్తూ, మన సాంప్రదాయ వస్త్రాల అద్భుత వైవిధ్యాన్ని చాటేందుకు, చేనేత వస్త్రాలు ధరించేందుకు ఎంతో ఇష్టపడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. తన కోసం రెండు చేనేత చీరలు కొనుగోలు చేసినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కొనుగోలు చేసిన చేనేత చీరలపై భువనేశ్వరి ఎక్స్(X) వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే చంద్రబాబు ట్వీట్‌ను రీట్వీట్ చేశారు
Chandrababu Bought Saree For Nara Bhuvaneswari :నేతన్నల చీర నేయడం అనేది గ్రామీణ జీవనోపాధికి మూలంతో పాటు సంప్రదాయ వారసత్వ కళ అని నారా భువనేశ్వరి గుర్తు చేశారు. దీనిని ఓ అద్భుతమైన ప్రక్రియగా అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అమూల్యమైన చేనేత రంగాన్ని పునరుద్ధరించి, దానికి పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
మొదటిసారి కొనుగోలు చీరపై భువనేశ్వరి స్పందన వైరల్ : నారా భువనేశ్వరి ఎన్నికలకు ముందు 'నిజం గెలవాలి' కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. గతంలో చంద్రబాబు చేసిన పనితో తనకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయిందంటూ, భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు కార్యక్రమంలో నవ్వులు పూయించాయి. ఇంతకీ అవి ఏంటీ అనేదేగా మీ సందేహం.