Nara Bhuvaneswari Nijam Gelavali Yatra in Anakapalli District : చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలాల్లో 'నిజం గెలవాలి' అనే కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఆర్. భీమవరం గ్రామంలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో మనస్థాపానికి గురై మృతి చెందిన ఎ. అప్పల ఆచార్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. తమ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తమ గ్రామాన్ని నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారని తెలిసి మహిళలు ఆమెను చూడటానికి వచ్చారు. వారందరిని భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించారు.
పాడేరులో 'నిజం గెలవాలి' - గిరిజనులతో ఆడిపాడిన భువనేశ్వరి
'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగానే అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారంలో ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన దేవుడమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
రాష్ట్రంలో రైతులు, యువత, నిరుద్యోగులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు సీఎం జగన్ పరిపాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భువనేశ్వరి పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తల నుంచి సామాన్య ప్రజలపై కూాడా అధికార ప్రభుత్వం దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార నాయకులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తరు. సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని పేర్కొన్నారు.