Nandigam Suresh PA Threatens Villagers: పల్నాడు జిల్లా అమరావతి మండలం లేమల్లెలో నందిగం సురేష్ పీఏ లక్ష్మణ్ వీరంగం సృష్టించారు. నందిగాం సురేష్ అనుచరులు లేమల్లె రియల్ ఎస్టేట్ స్థలాల్లో అక్రమంగా ఇసుక డంపింగ్ చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఇసుకను తరలించడానికి ప్రయత్నించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. లారీలు తీసుకెళ్లనీయకుండా స్థానికులు గ్రామంలోనే ఉంచారు. దీంతో లారీలు వదిలిపెట్టి సిబ్బంది పోయారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అక్రమ ఇసుక లారీలు అడ్డుకున్న గ్రామస్థులను లారీ ఎక్కి తొక్కిస్తానంటూ నందిగం సురేష్ పీఏ బెదిరింపులకు పాల్పడ్డారు.
నందిగం సురేష్ పీఏ వీరంగం- అక్రమ ఇసుక లారీలు అడ్డుకున్న గ్రామస్థులకు బెదిరింపులు - Nandigam Suresh PA Threatens Villagers - NANDIGAM SURESH PA THREATENS VILLAGERS
Nandigam Suresh PA Threatens Villagers: ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం మారినా వైఎస్సార్సీపీ నేతల్లో మార్పువచ్చినట్లు కనిపించడం లేదు. పల్నాడు జిల్లా అమరావతి మండలం లేమల్లెలో నందిగం సురేష్ పీఏ లక్ష్మణ్ వీరంగం సృష్టించారు. రాత్రికిరాత్రే ఇసుక తరలింపునకు యత్నించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. అక్రమ ఇసుక లారీలు అడ్డుకున్న గ్రామస్థులను లారీ ఎక్కి తొక్కిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
Nandigam Suresh PA Threatens Villagers (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 5, 2024, 3:55 PM IST