తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్​ ట్యాపింగ్​ కేసు నిందితులకు బెయిల్ నిరాకరణ - రాధాకిషన్​రావు పిటిషన్​పై 29న విచారణ - bail rejected in phone tapping case - BAIL REJECTED IN PHONE TAPPING CASE

Nampally Rejects Bail to Accused in Phone Tapping Case : ఫోన్​ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న నేపథ్యంలో పోలీసులు చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. మరోవైపు ఇదే కేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్​రావు బెయిల్​ పిటిషన్​పై ఈ నెల 29న విచారణ చేపట్టబోతుంది.

Phone Tapping Case
Court Rejects Bail to Accused in Phone Tapping Case

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 7:10 PM IST

Court Rejects Bail to Accused in Phone Tapping Case :ఫోన్​ ట్యాపింగ్​ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్​ నిరాకరించింది. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్​రావు బెయిల్​ పిటిషన్లను కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న నేపథ్యంలో పోలీసులు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు కోరగా న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. తాజాగా ఇదే కేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్​రావు ఇవాళ కోర్టులో బెయిల్​ పిటిషన్​ దాఖలు చేశారు. రాధాకిషన్​రావు పిటిషన్​పై కౌంటర్​ దాఖలు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ​ పిటిషన్​పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

Interim Bail To Radhakishan Rao :తాజాగా ఇదే కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావుకు శనివారం నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తన తల్లికి అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. రాధాకిషన్‌రావు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తల్లిని చూడటానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

రాధాకిషన్‌రావు తల్లి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పుపత్రిలో చికిత్స పొందుతోంది. మార్చి 10న ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా, గత మూడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న రాధాకిషన్‌రావు కోర్టును ఆశ్రయింగా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు ఈరోజు ఆయనను పోలీస్ ఎస్కార్ట్ మధ్య చంచల్‌గూడ జైలు నుంచి కరీంనగర్‌కు తీసుకెళ్లారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొందరి ప్రమేయం - త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి : హైదరాబాద్ సీపీ - Telangana Phone Tapping Case

Phone Tapping Case :గతేడాది డిసెంబరు 4వ తేదీ రాత్రి సీసీ టీవీలు ఆఫ్​ చేసి ఎస్​ఐబీ కార్యాలయంలో డేటానంతా తన వ్యక్తిగత పెన్​డ్రైవ్​, హార్డ్​డిస్క్​లలో ప్రణీత్​ కాపీ చేసుకున్నాడు. అనంతరం కంప్యూటర్​లో ఉన్న డేటాను డిలీట్​ చేసినట్లు అధికారులు గుర్తించారు. కంప్యూటర్​కు సంబంధించిన 42 హార్డ్​డిస్క్​లను మాయం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. అందులో ఉన్న సీడీఆర్​, ఐఎంఈఐ నంబర్లు, ఇంటర్నెట్​ ప్రోటోకాల్​ డేటాను చెరిపేశాడు. ఎలక్ట్రీషన్​ సాయంతో సీసీటీవీ కెమెరాలను ఆఫ్​ చేసి ఈ వ్యవహరమంతా నడిపించినట్లు అధికారులు గుర్తించారు.

దీనిని పరిశీలించి చూస్తే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Telangana Assembly Result) మరుసటి రోజే ప్రణీత్​ రావు ఈ చర్యలకు పాల్పడినట్లు అర్థమవుతోంది. కాగా దీనిపై ఎస్​ఐబీ అదనపు ఎస్పీ డీ.రమేశ్​ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణీత్​రావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రణీత్​రావు సహా ఇతరులపై ఐపీసీ సెక్షన్​ 409,427,201,120(బీ), రెడ్​ విత్​ 34, పీడీపీపీ యాక్టు, ఐటీ యాక్టు కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసి ఈ ఘటనతో సంబంధమున్న మరికొందరు ఆఫీసర్లను అరెస్ట్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు లేటెస్ట్ అప్డేట్ - ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్​వేర్! - ఇదంతా ఎవరి కోసం? - Telangana Phone Tapping Case

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు - TELANGANA PHONE TAPPING CASE

ABOUT THE AUTHOR

...view details