Mudragada Daughter Condemned her Father Comments on Pawan Kalyan:జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి ఖండించారు. కేవలం పవన్‌ను తిట్టించేందుకే సీఎం జగన్ తన తండ్రిని వాడుకుంటున్నారని విమర్శించారు. పిఠాపురంలో పవన్ విజయం కోసం కృషి చేస్తానని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ ఇటీవల ముద్రగడ పద్మనాభం (Mudragada comments on Pawan Kalyan) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె క్రాంతి స్పందించారు.
జగన్ పర్యటనలో పచ్చదనంపై గొడ్డలి వేటు- విద్యుత్ కోతలతో అల్లాడుతున్న ప్రజలు - Arrangements for CM Jagan Tour
ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ నేతలు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారని అన్నారు. మా నాన్న గారు బాధాకరమైన ఛాలెంజ్ చేశారని అన్నారు. పవన్ కల్యాణ్‌ను ఎన్నికలలో ఓడించి పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారని ఇటీవల తన తండ్రి అన్నారని క్రాంతి తెలిపారు. ఈ కాన్సెప్ట్ ఏంటో అస్సలు అర్థం కాలేదని అన్నారు.
అందరికీ మేలు చేసేలా కూటమి మ్యానిఫెస్టో - బంగారు భవితకు బాటలు వేస్తాం: పవన్ - Pawan Kalyan election campaign
తన తండ్రి చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకు కూడా నచ్చలేదని అన్నారు. వంగా గీతను గెలిపించేందుకు పనిచేయవచ్చు కానీ పవన్ కల్యాణ్‌ను, ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదని క్రాంతి వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్‌ను తిట్టించేందుకే తన తండ్రిని జగన్ వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత జగన్ తన తండ్రిని ఎటూ కాకుండా వదిలేస్తారని అన్నారు. ఈ విషయంలో తన తండ్రిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని పవన్ కల్యాణ్ గెలుపుకోసం తన వంతు కృషి చేస్తానని ముద్రగడ కుమార్తె క్రాంతి పేర్కొన్నారు.
పవన్‌ను తిట్టించేందుకే సీఎం జగన్ మా నాన్నను వాడుకుంటున్నారు- పవన్ విజయానికి కృషి చేస్తా : ముద్రగడ కుమార్తె (Etv Bharat) ఈ దశలో మార్చలేం - జనసేన గాజు గ్లాసు గుర్తు అంశంలో ఈసీ క్లారిటీ - JANASENA GLASS SYMBOL
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ నేతలు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. మా నాన్న గారు బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్‌ను ఓడించి పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ ప్రకటన ఆయన అభిమానులకూ నచ్చలేదు. వంగా గీతను గెలిపించేందుకు కష్టపడొచ్చు. కానీ పవన్ కల్యాణ్, ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. పవన్ కల్యాణ్‌ను తిట్టించేందుకే మా నాన్నను జగన్ వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయన్ను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో మా నాన్నను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. పవన్ కల్యాణ్ గెలుపు కోసం నా వంతు కృషి చేస్తా.- క్రాంతి బార్లపూడి, ముద్రగడ కుమార్తె