ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్లన్నీ బురదమయం - ప్రయాణం ప్రాణాంతకమే - Mud Roads People Facing Problems - MUD ROADS PEOPLE FACING PROBLEMS

Mud Roads People Facing Problems in Flood Hit Areas : రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో రహదారి చిత్తడిగా మారింది. దాదాపు 7 నెలల క్రితం డ్రైనేజీ పనులు పూర్తిచేసి కొంత మేర మెటల్ వేశారు. వర్షం పడడంతో రహదారి మెుత్తం అస్తవ్యస్తంగా మారిందని వాహనదారులు వాపోయారు.

mud_roads_people_facing_problems_in_flood_hit_areas
mud_roads_people_facing_problems_in_flood_hit_areas (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 12:17 PM IST

రోడ్లపై బురదనీటి వరదలు- ప్రయాణాలు ప్రాణాంతకమే (ETV Bharat)

Mud Roads People Facing Problems in Flood Hit Areas :అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని 516వ జాతీయ రహదారి బురదమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో రహదారి చిత్తడిగా మారింది. దాదాపు 7 నెలల క్రితం డ్రైనేజీ పనులు పూర్తి చేసి కొంత మేర మెటల్ వేశారు. వర్షం పడడంతో రహదారి మెుత్తం అస్తవ్యస్తంగా మారిందని చోదకులు వాపోయారు. బురదలో ఆర్టీసీ బస్సులు చక్రాలు ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యంతో వాహనాదారులు తీవ్ర గాయాల పాలవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

People Facing Problems with Damaged Roads :మండలంలోని పలు గ్రామీణ రహదారులు చిన్నపాటి వర్షాలకే బురదమయమై చిత్తడిగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులు, ప్రయాణికులు నిత్యం ఈ దారుల వెంట ప్రయాణించాల్సి ఉంటుంది. నడిచేటప్పుడు బురదలో ఏమాత్రం కాలు జారినా అంతే సంగతులు. వర్షం పడిన ప్రతిసారి ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి రహదారుల నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.

వర్షం వస్తే బురద నీరు, ఎండాకాలం వస్తే ఊట నీరు-మన్యంలో గిరిజనుల ఇబ్బందులు - Tribal Problems

మండలంలోని హిమ్మత్‌రావుపేట గ్రామం నుంచి నాచుపల్లి మీదుగా చెప్యాల ఎక్స్‌రోడ్డు వరకు రహదారి హిమ్మత్‌రావుపేట-నాచుపల్లి వరకు పూర్తిగా కంకర తేలి, గుంతలతో ఉండగా నాచుపల్లి నుంచి చెప్యాల ఎక్స్‌రోడ్డు వరకు గల రహదారి పూర్తిగా కోతకు గురై అటుగా ప్రయాణించడానికి వీలులేకుండా మారింది. దీంతో చెప్యాల ఎక్స్‌ రోడ్డుకు వెళ్లడానికి ఈదారి వెంట మూడు కి.మీ దూరం ఉండగా కొడిమ్యాల మీదుగా సుమారు ఆరు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. రాంసాగర్‌ నుంచి చెప్యాల ఎక్స్‌రోడ్డు వరకు ప్రధానమంత్రి సడక్‌యోజన పథకంలో భాగంగా రూ.2.46 కోట్లతో నిధులు మంజూరై టెండర్లు పూర్తయినప్పటికీ నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు.

వర్షాకాలం ముంచుకొచ్చినా చలనం లేదా?- అస్తవ్యస్త డ్రైనేజీలతో నగరాల్లో అవస్థలు - DRAINAGE PROBLEM

బొల్లోని చెరువు గ్రామం నుంచి వడ్డెర కాలనీకి వెళ్లే దారిలో తారురోడ్డు లేకపోవడంతో వర్షాకాలం గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు సూరంపేటకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి కోనాపూర్‌ గ్రామం వరకు, డబ్బుతిమ్మయ్యపల్లె నుంచి ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు, చింతలపల్లె-సంద్రాలపల్లె, చింతలపల్లె-శనివారంపేట వంటి గ్రామాలకు తారురోడ్డు లేక ప్రజలకు సమస్యలు తప్పడం లేదు.

మూడు రోజులుగా జలదిగ్బంధంలో కాలనీవాసులు - ఈటీవీ భారత్​ కథనానికి కదిలివచ్చిన అధికారులు - Rain Water Entered into Colony

ABOUT THE AUTHOR

...view details