Mother and Three CHildren Suicide in Annamayya District :నేటి కాలంలో చిన్నపాటి కారణాలతో, క్షణికావేశంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న అపజయాన్నీ తట్టుకోలేకపోతున్నారు. ప్రేమ విఫలమైందని ఒకరు, పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని మరొకరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయని, కుటుంబంలో సమస్యలను తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కారణం ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఫలితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్న వారిని విషాదంలోకి నెట్టేస్తున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ముగ్గురు పిల్లలో కలిసి నీటిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఇందుకు సంబంధించి స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాలివీడులోని చిలకలూరిపేటకు చెందిన వేముల నాగమణి వేముల విక్రమ్ భార్యాభర్తలు. వీరికి నవ్యశ్రీ (10), దినేశ్ (6). జాహ్నవి (3) అనే ముగ్గురు పిల్లలు. విక్రమ్ ఆటో నడపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చాలీ చాలని కుటుంబ ఆదాయంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి.
భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య
ఇదే విషయమై శుక్రవారం రాత్రి భార్య నాగమణితో విక్రమ్ ఘర్షణ పడ్డాడు. గొడవ పెద్దది కావడంతో తన పిల్లలతో కలిసి నాగమణి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ పరిణామాలతో తీవ్ర మనస్థాపనాకి గురైన ఆమె వెలిగల్లు ప్రాజెక్ట్ వద్ద ఉన్న గండిమడుగులో పిల్లలతో పాటు కలిసి అందులో దూకింది. గండిమడుగు ఒడ్డున ఉన్న చెప్పులు, సెల్‌ఫోన్‌ను గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు.