Mother Committed Suicide With Her Children in Ibrahimpatnam :తన ఇద్దరు పిల్లలతో తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో కుమారుడు తల్లి నుంచి తప్పించుకున్నాడు. మొత్తం ఘటనలో ముగ్గురు చెరువులోకి దూకగా, రెండు మృతదేహాలు గురువారం లభించగా, మరొకటి శుక్రవారం దొరికింది.
ఇద్దరు బిడ్డలను చెరువులోకి తోసేసి - ఆపై తానూ ఆత్మహత్య - ఇబ్రహీంపట్నంలో విషాదం - Mother Suicide With Children - MOTHER SUICIDE WITH CHILDREN
Mother Commits Suicide With Children : ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తూ చెరువు దగ్గరకు వెళ్లి వారిని ఆ చెరువులో తోసి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది.
Published : Sep 6, 2024, 1:49 PM IST
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని వనస్థలిపురం కూరగాయల మార్కెట్ సమీపంలో మంగమ్మ తన భర్త వర్సు కుమార్‌తో కలిసి నివాసం ఉంటుంది. ఈ క్రమంలో మంగమ్మ తన కుమార్తె లావణ్య, కుమారులు శరత్, గణేశ్లతో కలిసి గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇబ్రహీంపట్నం పెద్దచెరువు వద్దకు వెళ్లింది. ముందుగా కుమార్తె లావణ్య, కుమారుడు శరత్‌ను చెరువులోకి తోసేసి తర్వాత తానూ దూకింది. ఈ క్రమంలో మరో కుమారుడు గణేశ్ మంగమ్మ నుంచి తప్పించుకుని బయటకు వచ్చి ఏడుస్తూ ఉండిపోయాడు.
ఇది గమనించిన వాహనదారులు ఆరా తీయగా, 'అమ్మ, అక్క, అన్న చెరువులో దూకారని' చెప్పాడు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మంగమ్మ, శరత్‌ల మృతదేహాలు దొరికాయి. లావణ్య మృతదేహం లభ్యం కాలేదు. ఇద్దరూ స్కూల్ యూనిఫామ్‌లోనే ఉన్నారు. చెరువు దగ్గర పిల్లల స్కూల్ బ్యాగుల్లోని పుస్తకాల్లో తండ్రి ఫోన్ నంబరు చూసి పోలీసులు అతనికి సమాచారం ఇచ్చారు. కుటుంబ తగాదాలతోనే ఆమె పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా గురువారం గాలింపు చర్యలు చేపట్టగా, శుక్రవారం ఉదయం కుమార్తె లావణ్య మృతదేహం లభించింది. వారి మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.