తెలంగాణ

telangana

ETV Bharat / state

హైకోర్టులో మోహన్‌బాబుకు ఊరట - అప్పటివరకు పోలీసుల ముందు హాజరుకు మినహాయింపు - MOHAN BABU LUNCH MOTION PETITION

హైకోర్టులో మోహన్‌బాబు లంచ్‌మోషన్ పిటిషన్ - రాచకొండ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలని కోరిన మోహన్‌బాబు - ఈనెల 24 వరకు హాజరు నుంచి మినహాయింపు

Mohan Babu lunch motion petition In HC
Mohan Babu lunch motion petition In HC (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2024, 3:19 PM IST

Updated : Dec 11, 2024, 6:38 PM IST

Mohan Babu lunch motion petition In HC : సీనియర్​ నటుడు మోహన్​బాబు హైకోర్టులో లంచ్​ మోషన్​ పిటిషన్ దాఖలు చేశారు. రాచకొండ పోలీసుల నోటిసులపై స్టే ఇవ్వాలని ఆయన తన పిటిషన్​లో కోరారు. మోహన్​బాబు పిటిషన్​పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణను ఈనెల 24వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు పోలీసుల ముందు హాజరుకు మినహాయింపునిచ్చింది.

హైకోర్టులో మోహన్​ బాబుకు ఊరట :పోలీసులు మోహన్​బాబుకు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. రెండు పరస్పర ఫిర్యాదులపై నమోదైన కేసులు కాకుండా మోహన్​బాబుపై మరో కేసును నమోదు చేశామని పీపీ కోర్టుకు తెలిపారు. జర్నలిస్ట్​లపై దాడి చేసిన కేసులో మోహన్​బాబుపై మరో క్రిమినల్​ కేసు నమోదు చేశామని పీపీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల నోటీసులు అందుకున్న మనోజ్​ ఈరోజు విచారణకు హాజరయ్యారని పీపీ తెలిపారు.

పోలీసుల నోటీసులపై హైకోర్టు స్టే :మంచు మనోజ్​ బౌన్సర్లను తీసుకొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నారని కోర్టుకు మోహన్​బాబు తరఫు న్యాయవాది నగేశ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. కుటుంబ విషయాలను మీడియాలో పెద్దదిగా చేసి చూపిస్తున్నారని న్యాయస్థానానికి వివరించారు. మోహన్​బాబు అనారోగ్యం కారణంగా హాస్పిటల్​లో చేరారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు నోటీసులు ఇచ్చారని పిటిషనర్​ తరఫు న్యాయవాది వివరించారు. రక్షణ కల్పించాలని ఈ నెల 9న కమిషనర్​కు విజ్ఞప్తి చేసినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదని న్యాయవాది తెలిపారు.

మోహన్​బాబు ఇంటివద్ద పోలీస్​ గస్తీ ఏర్పాటు చేయాలని న్యాయవాది నగేశ్​ కోరగా అలా చేయడం సాధ్యం కాదని పీపీ తెలిపారు. ప్రతి రెండు గంటలకు ఓసారి గస్తీ పోలీసులు మోహన్​ బాబు ఇంటివద్దకు వెళ్లి వస్తున్నారని పీపీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మోహన్​ బాబుకు ఈనెల 24 వరకు పోలీసుల ముందు హాజరుకు మినహాయింపు ఇస్తూ తదుపరి విచారణను డిసెంబర్​ 24 వ తేదీకి వాయిదా వేసింది.

ఆసుపత్రిలో మోహన్​ బాబు - జల్​పల్లి ఘటనపై పోలీసు శాఖ సీరియస్

'మా నాన్నను అన్న విష్ణు, వినయ్​ ట్రాప్​ చేశారు - ఆయన దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు'

Last Updated : Dec 11, 2024, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details