MLC Kavitha on Caste Census Resolution Bill : అసెంబ్లీలో కేవలం కులగణన తీర్మానంపెట్టి తెలంగాణ ప్రజలకు మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ప్రభుత్వం అసెంబ్లీ ప్రవేశపెట్టిన కులగణన తీర్మానంపై ఆమె నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు బీసీల కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే లోపల 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని, తద్వారా 29 వేల మంది బీసీ బిడ్డలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయని కాంగ్రెస్ నమ్మబలికిందని కవిత వివరించారు. ఎన్నికల తరువాత కంటి తుడుపు చర్యలాగా ఒక తీర్మానం చేసి ఈ అంశాలను పక్కకు పెట్టారని విమర్శించారు.
దేశానికి ఆదర్శంగా ఉండేలా కులగణన - అందరి సలహాలు, సూచనలతో ముందుకెళ్తాం : మంత్రి పొన్నం
Telangana Government Passed Caste Census Resolution Bill :బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని, ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు రెండు అసెంబ్లీ సమావేశాలు అయినా ఇప్పటి వరకు బీసీ సబ్ ప్లాన్‌కు అతీగతీ లేదని విమర్శించారు. ఎప్పుడు కులగణన మొదలుపెడతారు, ఏ సంస్థ ద్వారా చేస్తారని ప్రశ్నించారు. కులగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారని నిలదీశారు. దీని లక్ష్యం ఏంటని చెప్పకుండా మభ్యపెట్టే విధంగా తీర్మానం చేశారని మండిపడ్డారు. కులగణనకు సంబందించి చట్టం ప్రవేశ పెట్టి చట్ట బద్ధత కల్పించాలన్న కవిత, బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్దత కల్పించి రూ.20 వేల కోట్ల నిధులతో పాటు అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు.
'పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే మా ఉద్దేశ్యం' - అసెంబ్లీలో కులగణన తీర్మానం ఆమోదం