MLC Kavitha Judicial Custody Extended Till May 20th: దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఇవాళ్టితో జ్యూడీషియల్ కస్టడీ ముగియగా అధికారులు తిహాడ్ జైలు నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరపరిచారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి మేరకు ఈ నెల 20 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Delhi Liquor Scam Case Update: దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై రౌజ్ అవెన్యూ కోర్టు విచారించింది. 8 వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను ఈడీ దాఖలు చేసినట్లు తెలిపింది. దీన్ని పరిగణలో తీసుకునే అంశంపై ఈ నెల 20న విచారణ చేస్తామని పేర్కొంది. న్యాయమూర్తి కావేరీ బవేజా సోమవారమే దీనిపై విచారణ చేపట్టాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లో గోవా ఆప్ అసెంబ్లీ ప్రచార వ్యవహారాలు చూసిన చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్‌కుమార్, చన్‌ప్రీత్ సింగ్‌తోపాటు, ఇండియా ఎహెడ్ వార్తా ఛానల్ మాజీ ఉద్యోగి అర్వింద్‌సింగ్‌లనూ నిందితులుగా చేర్చింది.
దిల్లీ మద్యం కేసు - ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు - kavitha Judicial Custody Extended