MLC Jeevan Reddy Comments on BJP: దేశ యువతను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని 2014లో చేసిన వాగ్దానాలు ఏమిటో మోదీ గుర్తు చేసుకోవాలని కాంగ్రెస్ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా అని అడిగారు.
ఎలక్టోరల్ బాండ్లపై వాస్తవాలు కప్పిపుచ్చుతున్నారని ఏ పార్టీకి ఎవరు చందాలు ఇస్తున్నారనేది ప్రజలకు తెలియాలని జీవన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో అమిత్ షా చెప్పినట్లు వ్యవస్థలు నడుస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా కూడా కిషన్‌రెడ్డిలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లనే రద్దు చేస్తారని తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌లో లబ్ధి పొందేది ఎవరో అందరికీ తెలుసున్నారు.
జగిత్యాలలో మహిళల ద్విచక్ర వాహన ర్యాలీ - జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
MLC Jevan Reddy Fires On KCR : ఎస్సారెస్పీలో నీటి కొరతకు కేసీఆర్‌దే నైతిక బాధ్యతని వర్షా కాలంలో మేడిగడ్డ నీరును ఎస్సారెస్పీకి తరలించలేదని తెలిపారు. ఈశాన్య రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేక వర్షం కురవలేదన్నారు. మిషన్ భగీరథ టెక్నికల్ ఆఫీసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 20 కిలో మీటర్ల నీటి ప్రవాహం తర్వాత వాటర్ ప్యూరిఫైర్ ప్రభావం ఏమీలేదని పవర్ ప్లాంట్‌పై జ్యుడీషియల్ దర్యాప్తు వేయడంతో కేసీఆర్‌కు భయం మొదలైందని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ లేకుంటే కాళేశ్వరం లేదని మేడిగడ్డ కుంగిన తర్వాత నీటి పంపింగ్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.