తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం సభకు జన సమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు - Cyber Criminals Cheat MLA - CYBER CRIMINALS CHEAT MLA

MLA Case File on Cyber Criminals in Telangana : సైబర్ నేరగాళ్ల వలకు ఏకంగా ఓ ఎమ్మెల్యేనే చిక్కాడు. తాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని అంటూ ఫోన్​ చేసి ముఖ్యమంత్రి ఒక కొత్త రుణ పథకాన్ని ప్రారంభించబోతున్నారని మాయమాటలు చెప్పి రూ.3.60 లక్షలు కాజేశాడు. కొన్ని రోజులకు మోసపోయానని తెలుసుకున్న ఎమ్మెల్యే తన పీఏ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Latest Cyber Fraud in Hyderabad
MLA Case File on Cyber Criminals in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 9:51 AM IST

Updated : May 19, 2024, 12:25 PM IST

MLA Case File on Cyber Criminals in Telangana: సైబర్​ నేరగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా, బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. సామాన్యులకు ఫ్రీ గిఫ్ట్​, డిస్కౌంట్​, తక్కువ డబ్బులతో ఎక్కవ సంపాదించుకోవచ్చు, ఇలా తదితర మార్గాల్లో గాలం వేస్తున్నారు. వారి వలకు సామాన్యులే కాదు వీఐపీలు కూడా దొరికిపోతున్నారు. ప్రముఖుల పేరుతో ఖాతాలు తెరిచి కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ప్రస్తుతం సైబర్​ నేరగాళ్లకు ఏకంగా ఓ ఎమ్మెల్యేనే చిక్కాడు. అది ఎలానో తెలుసుకుందాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శినంటూ సైబర్​ నేరగాడు ఓ ఎమ్మెల్యేకు ఫోన్​ చేశాడు. ఈ రకంగా ఆ ఎమ్మెల్యేతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం తొందర్లోనే ముఖ్యమంత్రి కొత్త రుణ పథకం ప్రారంభించబోతున్నారని చెప్పాడు. ఆ పథకం కింద వందల మందికి రూ.లక్షల్లో రుణాలు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపాడు. ఎమ్మెల్యే కోటా కింద 100 మందికి రుణాలు అందేలా తాను చూస్తానని ఎమ్మెల్యేను సైబర్​ నేరగాడు నమ్మించాడు. ఇందుకు గానూ ఒక్కో మనిషికి రూ.3600 ఇస్తే పని జరుగుతుందని చెప్పాడు.

పార్శిల్ పేరిట మోసం - బాధితుడి ఖాతా నుంచి రూ.20 లక్షలు స్వాహా - Cyber ​​fraud in the name of parcel

Latest Cyber Fraud in Hyderabad : సైబర్​ నేరగాడు చెప్పిన మాటలు నమ్మిన ఎమ్మెల్యే వెనకా ముందు ఆలోచించకుండా రూ.3.60 లక్షలు నేరగాడి ఖాతాలో జమ చేశాడు. నగదు ఖాతాలోకి పడినప్పటి నుంచి నేరగాడి ఫోన్​ స్విచ్ఛాఫ్​ రావడంతో పీఏ ద్వారా విచారణ చేయించాడు. అనంతరం మోసపోయామని తెలుసుకుని పీఏ ద్వారా సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుడు తోట బాలాజీ నాయుడు అలియాస్​ మల్లారెడ్డి అలియాస్​ అనిల్​ కుమార్​ అని తేలింది. నిందితుడిని అరెస్ట్​ చేసి, అనంతరం రిమాండ్​కు తరలించారు. గతంలో నిందితుడిపై 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 37 కేసులు ఉన్నట్లు గుర్తించారు. 2008లో రామగుండం ఎన్టీపీఎస్​లో ఏఈగా పని చేశాడని, 2009లో ఓ ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు.

3 నిమిషాల్లో రూ.1.10 కోట్లు కొట్టేశారు - 25 నిమిషాల్లోనే సొమ్ము రికవరీ చేసిచ్చారు - 1 Crore recovery From Cyber Fraud

Last Updated : May 19, 2024, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details