ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎవరూ భయపడొద్దు - అన్ని విధాలా ఆదుకుంటాం: ప్రజలకు మంత్రుల భరోసా - Ministers Visit Flooded Areas

Ministers Visiting Flood Affected Areas: వరద ముంపు ప్రాంతాల్లో రేయింబవళ్లనే తేడా లేకుండా సహాయక చర్యల్లో మంత్రులు నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని ఏవరూ భయపడొద్దని వారికి ధైర్యం చెప్తున్నారు.

Ministers_Visit_Flooded_Areas
Ministers_Visit_Flooded_Areas (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 4:25 PM IST

Updated : Sep 3, 2024, 5:29 PM IST

Ministers Visiting Flood Affected Areas:రేయింబవళ్లనే తేడా లేకుండా వరద సహాయక చర్యల్లో మంత్రులు నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. చిన్నారులు, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని ఏవరూ భయపడొద్దని వారికి ధైర్యం చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు.

Home Minister Anita:వరద ముంపు నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. విజయవాడ భవనీపురం లలితానగర్​లో ముంపు ప్రాంతాల్లో హోంమంత్రి పర్యటించారు. ట్రాక్టర్​పై ప్రయాణం చేస్తూ బాధితులకు ఆహార పొట్లాలు, నీరు పంపిణీ చేశారు. నీరు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. మంత్రితో పాటు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

Minister Nara Lokesh:మంత్రి నారా లోకేశ్​ పర్యవేక్షణలో విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో 6 హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు సరఫరా చేశారు. బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా చేస్తున్నారు. గన్నవరం ఎమ్మల్యే యార్లగడ్డ వెంకట్రావ్ విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్సార్​ కాలనీకి ప్రత్యేక హెలికాప్టర్‌లో 2,500 ఆహార పొట్లాలు చేరవేశారు. విజయవాడ పరిధిలో వరద ముంపునకు గురైన 32 వార్డుల్లో సీనియర్ ఐఏఎస్​ అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో 70 పునరావాస కేంద్రాల్లో 14,452 మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు.

వరద బాధితులను ఆదుకోవడమే లక్ష్యం- ఆపద సమయంలో కుట్రలా? : చంద్రబాబు - CM review flood relief measures

Minister Achennaidu:విజయవాడ అజిత్ సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటిస్తున్నారు. సింగ్ నగర్ 45 వ డివిజన్, 46, 47 డివిజన్లలో మంత్రి పర్యటించారు. ముంపు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జేసీబీపై తిరుగుతూ ముంపు బాధితులతో మాట్లాడారు. సింగ్ నగర్, వైఎస్సార్ కాలనీల్లో ముంపు తీవ్రతకు స్థానిక ప్రజలు పడుతున్న బాధలు చూసి మంత్రి అచ్చెన్నాయుడు చలించిపోయారు. ఈ క్రమంలో 3 ట్రాక్టర్ల ఆహార పొట్లాలు. 2 ట్రాక్టర్ల నీళ్ల బాటిళ్లు బాధితులకు అందజేశారు. వైఎస్సార్​ కాలనీ, రాజరాజేశ్వరిపేట, జక్కంపూడిలో మంత్రి పర్యటించారు.

Minister Gummidi Sandhyarani:వరద విపత్తు నుంచి విజయవాడ కోలుకునేంత వరకు విశ్రమించబోమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. బాధితులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. విజయవాడలోని రణధీర్ నగర్, రాణిగారితోట ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సంధ్యారాణి పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ బాధితులను పరామర్శించారు.

అర్ధరాత్రి వరకు క్షేత్రస్థాయిలోనే: సీఎం చంద్రబాబు దూరదృష్టితో వరద నష్టాన్ని తగ్గించగలిగామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఒలేరు, రావి అనంతవరం వద్ద బలహీనంగా ఉన్న కరకట్టను అమాత్యులు పరిశీలించారు. పెనుమూడి ఘాట్ వద్ద వరద పరిస్థితిని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నీటిమునకకు గురైన పెనుమూడి, పల్లెపాలెం పరిస్థితిపై ఆరా తీశారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులు అధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పెద్ద మనసు చాటుకున్న సీనీ హీరోలు - వరద సాయం ఎవరెంత ఇచ్చారంటే! - Tollywood donates to flood victims

విద్యుత్ శాఖ అప్రమత్తం: వరదల నేపథ్యంలో విద్యుత్ శాఖను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అప్రమత్తం చేశారు. ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ నుంచి టెక్నీషియన్లను రప్పించారు. 300లకుపైగా టెక్నీషియన్లు విజయవాడకు చేరుకున్నారు. వరద ప్రవాహం తగ్గిన వెంటనే క్షేత్ర స్థాయిలో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రంగం సిద్దం చేశారు. బృందాలవారీగా దెబ్బతిన్న సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మ‌ర్స్​ దగ్గర సిబ్బంది మరమత్తులు చేయనున్నారు.

నిరంతరాయంగా శ్రమిస్తున్న టీడీపీ శ్రేణులు: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల విజయవాడ పట్టణంలో ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరి అతలాకుతలమైన ప్రజలకు తన వంతు సాయంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆహార పొట్లాలు అందిస్తున్నారు. వరద ముంపుకు గురై నిరాశ్రయులైన వారికి తన వంతు సాయంగా 40 వేల ఆహార పట్లాలను అద్దంకి నుంచి విజయవాడకు పంపించారు. నిన్న 40 వేల ఆహార ప్యాకెట్లు పంపించిన మంత్రి ఈ రోజు కూడా మరో 40,000 ప్యాకెట్లు తయారు చేయించి పంపించారు. తెలుగుదేశం కార్యకర్తలు రెండు రోజుల నుంచి నిరంతరాయంగా శ్రమిస్తూ ఆహార పొట్లాలు తయారు చేసి పంపించే కార్యక్రమంలో భాగమయ్యారు.

విజయవాడలో హెలికాప్టర్ల ద్వారా వరద ప్రాంతాల్లో ఆహారం పంపిణీ - Food distribution With Helicopters

Last Updated : Sep 3, 2024, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details