తెలంగాణ

telangana

ETV Bharat / state

విజయవాడ- జగదల్‌పూర్‌ మార్గంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరాం : తుమ్మల - Tummala on Highway Constructions - TUMMALA ON HIGHWAY CONSTRUCTIONS

Minister Tummala on Khammam Development : విజయవాడ - జగదల్‌పూర్‌ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేశామన్న తుమ్మల, గత ప్రభుత్వం రూ.180 కోట్లు కేటాయించలేక రింగ్‌రోడ్డును పక్కకు పెట్టేసిందని దుయ్యబట్టారు.

Minister Tummala on Khammam Development
Minister Tummala on Highway Construction (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 4:49 PM IST

Updated : Jun 29, 2024, 7:25 PM IST

Minister Tummala on Khammam Highway Constructions :విజయవాడ- జగదల్‌పూర్‌ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రహదారుల నిర్మాణంలో కేంద్రానికి పలు ప్రతిపాదనలు పెట్టినట్లు వివరించారు. ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాల మీదుగా హైవే వెళ్తునందున బైపాస్‌ రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఖమ్మం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేశామన్న ఆయన, గత ప్రభుత్వం రూ.180 కోట్లు కేటాయించలేక రింగ్‌రోడ్డును పక్కన పెట్టేసిందని దుయ్యబట్టారు.

భద్రాచలం పట్టణంలోనూ కొన్ని రోడ్ల విస్తరణకు ఆమోదం లభించిందన్నారు. భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు, జగ్గయ్యపేట నుంచి వైరా, తల్లాడ మీదుగా కొత్తగూడెం వరకు 4 లైన్ల హైవేకి ప్రతిపాదనలు పంపించామని మంత్రి తెలిపారు. కోదాడ-ఖమ్మం మధ్య రూ.1.039 కోట్లతో నిర్మించిన 32 కి.మీ మేర రహదారి ఆగస్టు 30 కల్లా అందుబాటులోకి వస్తుందన్నారు. ఖమ్మం-కొరివి మధ్య రూ.445 కోట్లతో 37 కి.మీ రోడ్ల నిర్మాణానికి గతంలోనే అనుమతులిచ్చామని తెలిపారు. దీని నిర్మాణానికి మరో రెండేళ్లు సమయం పడుతుందని వెల్లడించారు.

Last Updated : Jun 29, 2024, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details