తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓఆర్‌ఆర్‌ లోపల ఐటీ కంపెనీలు - రీజినల్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో పరిశ్రమలు' - SRIDHAR BABU ON TELANGANA IT SECTOR - SRIDHAR BABU ON TELANGANA IT SECTOR

Minister Sridhar Babu speech at FICCI Summit : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు- సమ్మిళిత అభివృద్ధి, మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర అనే అంశంపై ఫిక్కి మహిళా విభాగం సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఫిక్కి మహిళా విభాగం నుంచి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే పరిగణనలోకి తీసుకుంటామని శ్రీధర్ బాబు తెలిపారు.

Sridhar babu speech at Ficci summit
Sridhar babu speech at Ficci summit (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 4:54 PM IST

Updated : Jun 24, 2024, 5:17 PM IST

Minister Sridhar Babu on IT Development :తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు - సమ్మిళిత అభివృద్ధి’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం ఏర్పాటు చేయబోతోందని, అందులో మహిళా పారిశ్రామికవేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. పారిశ్రామిక విధానంలో భాగంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Sridhar Babu On IT Companies in Hyderabad : బాహ్యవలయ రహదారి (ఓఆర్ఆర్) లోపల ఐటీ కంపెనీలు, ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) లోపల పరిశ్రమలు, ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ సంస్థలను ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మహిళా శక్తిని మరింతగా ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. మహిళలు పెద్ద ఎత్తు ముందుకు వస్తే, ప్రభుత్వం సహరిస్తుందని చెప్పారు.

'ద్రిష్టి-10 యూఏవీ నౌకదళ రంగానికి అదనపు బలం చేకూరుస్తుంది'

Minister Sridhar Babu On Women Development :రాష్ట్ర ప్రగతిలో మహిళలను భాగస్వాములను చేయాలని చూస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తద్వారా లక్షలాది మంది మహిళలకు ఉపాధి కల్పించే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అందు కోసం ఫిక్కి మహిళా విభాగం నుంచి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే పరిగణనలోకి తీసుకుంటామని శ్రీధర్ బాబు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని పునరుద్ఘాటించారు.

'మహిళలకు వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తాం. వాళ్లు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం తగిన సహకారం అందిస్తాం. ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తోంది. అందులో మహిళా పారిశ్రామికవేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తాం. పారిశ్రామిక విధానంలో భాగంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ఏర్పాటు చేస్తాం. ఓఆర్‌ఆర్‌ లోపల ఐటీ కంపెనీలకు ప్రాధాన్యం ఉంటుంది. రీజినల్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో పరిశ్రమలు, మిగతా ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తాం.'- శ్రీధర్ బాబు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి

ఉద్యోగ కల్పన దిశగా చర్యలు చేపట్టాం - అన్ని ఖాళీలను భర్తీ చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

Last Updated : Jun 24, 2024, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details