Minister Sridhar Babu On AI Health : కృత్రిమ మేథను ఉపయోగించి ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఆరోగ్య వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తోందని కృత్రిమ మేథ సాయంతో అన్ని వివరాలను పొందుపరుస్తామని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్జానం ఉపయోగించి వైద్య ఆరోగ్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని చెప్పారు.
హెల్త్ ఫ్రొఫైల్ సేకరించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సులభంగా చికిత్స అందించే అవకాశం ఉంటుందని శ్రీధర్ బాబు అన్నారు. హైటెక్ సిటీలోని ఐటీ కారిడార్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రావిడెన్స్ కార్యాలయాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అమెరికాకు చెందిన ప్రావిడెన్స్ కంపెనీ ఆరోగ్య రంగంలో సాంకేతిక సేవలందిస్తోంది. రాబోయే రోజుల్లో సేవలు మరింత విస్తరిస్తామని ప్రావిడెన్స్ చీఫ్ గ్లోబల్ ఆఫీసర్ మురళీ కృష్ణ తెలిపారు.
ప్రభుత్వ పథకాలను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకుల అసత్య ప్రచారం : మంత్రి శ్రీధర్ బాబు