తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారంను 1.35 కోట్ల మంది దర్శించుకున్నారు - మంత్రి సీతక్క - మేడారం జాతర ముంగిపు ఉత్సవాలు

Minister Seethakka on Medaram Jathara : మేడారం జాతర విజయవంతంగా నిర్వహించామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మేడారంలో సమ్మక్క - సారలమ్మలను 4 రోజుల్లో 1.35 కోట్ల మంది దర్శించుకున్నారని సీతక్క వెల్లడించారు. జాతరలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తమ వంతు కృషి చేశామని పేర్కొన్నారు. 20 శాఖల అధికారులు జాతర పనుల్లో కష్టపడి పనిచేశారని సీతక్క తెలిపారు.

minister seethakka on medaram fair
Minister Seethakka on Medaram Jathara

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 4:24 PM IST

Updated : Feb 24, 2024, 5:25 PM IST

మేడారంను 1.35 కోట్ల మంది దర్శించుకున్నారు - మంత్రి సీతక్క

Minister Seethakka on Medaram Jathara :మేడారం జాతర విజయవంతంగా నిర్వహించామని మంత్రి సీతక్క(Minister Seethakka) పేర్కొన్నారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మేడారం జాతరను(Medaram Jatara ) 4 రోజుల్లో 1.35 కోట్ల మంది దర్శించుకున్నారని సీతక్క వెల్లడించారు. జాతరలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు ఇచ్చిందన్నారు.

భక్తులకు ఇబ్బంది కలగకుండా తమ వంతు కృషి చేశామని సీతక్క పేర్కొన్నారు. 20 శాఖల అధికారులు జాతర పనుల్లో కష్టపడి పనిచేశారని తెలిపారు. మేడారం జాతరకు ఆర్టీసీ, దాదాపు 6 వేల బస్సులతో దాదాపు 12 వేల ట్రిప్పులను నడిపిందన్నారు. జాతరలో 5092 మంది మిస్‌ అయ్యారని, వారిలో 5060 మందిని కనిపెట్టి కుటుంబీకులకు అప్పగించినట్లు తెలిపారు. మరో 32 మంది అధికారుల వద్ద జాగ్రత్తగా ఉన్నారన్నారు. వారిని కూడా కుటుంబీకులకు క్షేమంగా అప్పగిస్తామన్నారు.

ముగింపు దశకు మేడారం మహా జాతర - నేడు వనప్రవేశం చేయనున్న దేవతలు

Medaram Fair Last Day :మేడారంలో 10 రోజుల పాటు పారిశుద్ధ్య పనులు జరుగుతాయని సీతక్క స్పష్టం చేశారు. జాతర జరిగిన తీరుపై మరోసారి సమీక్షిస్తామన్నారు. ఏమైనా లోటుపాట్లు జరిగితే సమీక్షించి సరిదిద్దుకుంటామని వెల్లడించారు. వచ్చే మినీ జాతర, మహాజాతరకు మెరుగైన ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.

"మేడారం జాతర విజయవంతంగా నిర్వహించాం. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలు. మాకు వచ్చిన ఆధారాల ప్రకారం మేడారంలో సమ్మక్క - సారలమ్మలను 4 రోజుల్లో 1.35 కోట్ల మంది దర్శించుకున్నారు. జాతరలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు ఇచ్చింది. మేడారం జాతరకు ఆర్టీసీ, దాదాపు 6 వేల బస్సులతో దాదాపు 12 వేల ట్రిప్పులను నడిపింది. ఏమైనా లోటుపాట్లు జరిగితే సమీక్షించి సరిదిద్దుకుంటాము". - సీతక్క, మంత్రి

Speaker Gaddam Prasad Visit Medaram Fair :మేడారంలో భక్తులకు ఎలాంటి కష్టం కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్(Speaker Gaddam Prasad​) స్పష్టం చేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న సభాపతి, మొక్కులు సమర్పించుకున్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు హామీలను ముందుకు సాగనిచ్చేలా చూడాలని తల్లులను కోరుకున్నానని గడ్డం ప్రసాద్ తెలిపారు. తనకు 9ఏళ్లుగా సంతానం కలగలేదని సమ్మక్కను మొక్కితే కూతురు పుట్టిందని సభాపతి వెల్లడించారు. ఇప్పుడు తన కూతురికి 22ఏళ్ల వయస్సుగా పేర్కొన్న శాసనసభాపతి, పుట్టినప్పటి నుంచి ప్రతిసారి జాతరకు వస్తున్నానని వివరించారు.

వరుసగా మూడోసారి వన దేవతలను దర్శించుకోవడం ఆనందంగా ఉంది : గవర్నర్ తమిళిసై

అశేష జనసందోహంతో అకట్టుకుంటున్న మేడారం డ్రోన్ దృశ్యాలు

Last Updated : Feb 24, 2024, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details