తెలంగాణ

telangana

ETV Bharat / state

విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై చర్యలు తప్పవు : మంత్రి సీతక్క - MINISTER SEETHAKKA REVIEW

Minister Seethakka Review in Mahabubabad : రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు సీఎం రేవంత్​రెడ్డి పోలీసులకు కఠిన ఆదేశాలు జారీచేశారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 8:20 PM IST

Updated : Jun 22, 2024, 8:47 PM IST

SEETHAKKA REVIEW MAHABUBABAD
Minister Seethakka Review in Mahabubabad (ETV Bharat)

Minister Seethakka Review in Mahabubabad :రాష్ట్రంలో డ్రగ్స్​కు బానిసలుగా మారడంతో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, పంచాయితీరాజ్​శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మత్తుపదార్థాలను నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాదకద్రవ్యాలను సంపూర్ణంగా నిషేధించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు.

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం మరో అడుగు - సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం - Mahila Shakti Canteens

వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. విద్యాశాఖలో జిల్లా వ్యాప్తంగా కేవలం ఇద్దరు ఎంఈఓలు విధులు నిర్వహించడాన్ని చూస్తే గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోందన్నారు. దీంతో విద్యాశాఖ అధ్వానంగా మారిందని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లాలో భూకబ్జాదారులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. అసంపూర్తిగా ఉన్న వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఇది తొలి సమావేశం అయినందున అధికారులను సున్నితంగా మందలించామని, త్వరలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల దృష్టిసారించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మురళి నాయక్, డాక్టర్ రామచంద్రు నాయక్, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

"రాష్ట్రంలో డ్రగ్స్​కు బానిసలుగా మారడంతో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మత్తుపదార్థాలను నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యలకు త్వరగా స్పందించాలి". - సీతక్క, మంత్రి

అత్యాచార నిందితులను ఎవ్వరిని వదిలిపెట్టం- మంత్రి సీతక్క

మహిళా శక్తి ఓ బ్రాండ్‌ కావాలి : మంత్రి సీతక్క - Mahila Shakti programme

Last Updated : Jun 22, 2024, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details