ETV Bharat / state

మూసీ నిర్వాసితులకు అండగా సర్కార్ - విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీ - Committee for Musi River Victims

మూసీ నది నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి - విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు - సెర్ఫ్ సీఈవో ఛైర్మన్​గా 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీ ఏర్పాటు

CONGRESS ON MUSI RIVER VICTIMS
Government appointed Committee for Musi River Victims (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2024, 9:02 PM IST

Government appointed Committee for Musi River Victims : మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నది గర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం, విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ఫ్ సీఈవో ఛైర్మన్​గా, జీహెచ్ఎంసీ కమిషనర్ వైస్ ఛైర్మన్​గా 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

మూసీ రివర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ దాన కిషోర్ మెంబర్ కన్వీనర్​గా ఉన్న ఈ కమిటీలో మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖతోపాటు పాఠశాల విద్య కమిషనర్, తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీలోని సభ్యులు తమ తమ శాఖలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించి 30 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది.

నిర్వాసితుల కోసం హెల్ప్ డెస్క్​లు : ఆరేళ్ల పిల్లలకు సమీపంలోని అంగన్ వాడీల్లో ప్రవేశాలు కల్పించడం, మహిళా స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం కమిటీ బాధ్యతలుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. జీహెచ్ఎంసీలోని యూసీడీ విభాగం ద్వారా జీవనోపాధి కోసం సర్వే చేయడం, మెప్మా ద్వారా బ్యాంకు లింకేజీలు సులభరతం చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల సహకారంతో వివిధ సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారిని గుర్తించడం, విద్యార్థులకు వారి సమీపంలోని పాఠశాలలు, రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేలా చూడటం కమిటీ బాధ్యతలుగా ప్రభుత్వం ఆదేశించింది. అలాగే నిర్వాసితులకు ఎప్పటికప్పుడు సహాయంగా ఉండేందుకు హెల్ప్ డెస్క్​లు ఏర్పాటు చేయడం, పౌర సమాజంతో కమిటీ సంప్రదింపులు జరుపుతుండటం చేయాలని ప్రభుత్వం సూచించింది.

కాంగ్రెస్​ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తోంది. ఓవైపు కూల్చివేతలు కొనసాగగా మరోవైపు మార్కింగ్ చేసిన ఇళ్లలోని పలు కుటుంబాలు హుటాహుటినా సామగ్రిని సర్దుకొని వారికి కేటాయించిన రెండు పడకల గదుల ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రతిపక్షాలు సైతం మూసీ నది ప్రక్షాళన చేయకూడదని ఆందోళన వ్యక్తం చేశాయి. మూసీ నది ప్రక్షాళన వల్ల పేద కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోతారని మండిపడ్డాయి.

మూసీ నిర్వాసితులకు ప్రత్యామ్నాయంపై సూచనలు ఇవ్వండి - ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ పిలుపు - CM REVANTH ON MUSI DEVELOPMENT

మూసీ నది ప్రక్షాళనలో మరో అడుగు - కూల్చివేతలు షురూ చేసిన అధికారులు - Demolitions at Shankar Nagar

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.