తెలంగాణ

telangana

ETV Bharat / state

'మా పెళ్లై పది సంవత్సరాలవుతోంది - రేషన్​​కార్డు ఎప్పుడిస్తారు సారు?' - Minister Ponnam meet farmers - MINISTER PONNAM MEET FARMERS

Minister Ponnam meet Farmers : కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్​పై మహిళా రైతులు తమ గోడు వినిపించారు. పదేళ్లవుతున్నా తమకింతా రేషన్ కార్డు ఇవ్వలేదని ఓ మహిళా రైతుకూలీ చెబితే, మాకింక రుణమాఫీ జరగలేదంటూ మరో మహిళా రైతు పొన్నంకు మొరపెట్టుకుంది.

Minister Ponnam interacted with Farmers
Minister Ponnam meet Farmers (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 2:25 PM IST

Updated : Aug 3, 2024, 2:43 PM IST

Minister Ponnam interacted with Farmers : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. చిగురమామిడి మండలంలోని చిన్న ముల్కనూరుకు వెళ్తుండగా, దారిలో వరి నాట్లు వేస్తున్న రైతులు వ్యవసాయ కూలీలతో కాసేపు సంభాషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలును మంత్రి రైతులకు వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. ఇప్పటికే లక్ష, లక్ష 50 వేల లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. ఓ మహిళా రైతు, తమ పెళ్లై పది సంవత్సరాలు అవుతోందని కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని, కుటుంబ సభ్యుల పేర్లు ఎప్పుడు చేర్చుతారని మంత్రిని అడిగారు.

దీనికి పొన్నం స్పందిస్తూ కొత్త రేషన్ కార్డులను త్వరలో జారీ చేస్తామని పేర్కొన్నారు. ఒక వేళ రైతు రుణమాఫీ కానీ వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు మంత్రి పొన్నం సూచించారు. తమ ప్రభుత్వంలో పంటల భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, గతంలో పంట నష్టపోయిన వారికి ఎలాంటి నష్ట పరిహారం వచ్చేది కాదని మంత్రి తెలిపారు. నాట్లు వేస్తుండగా మహిళా రైతులు పాడిన పాటను మంత్రి ఆసక్తిగా గమనించారు.

మంత్రి : అందరికి రుణమాఫీ అయ్యిందా? ప్రభుత్వం ఇంటికి రూ, 2 లక్షల రుణమాఫీ చేస్తుంది.

మహిళ రైతు : మాకింకా కాలేదు సర్​

మంత్రి : మీ ఆధార్​ కార్డు, భూమి పాస్​బుక్​తో ఏఈవోని కలవండి. సమస్యను పరిష్కరిస్తారు

మహిళ కూలీ : సర్​ మా పెళ్లై పది సంవత్సరాలవుతోంది. కొత్త రేషన్​కార్డులు ఎప్పుడు ఇస్తారు?. రేషన్​ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు ఎప్పుడు చేర్చుతారు.

మంత్రి : ప్రభుత్వం త్వరలోనే అందరికి నూతన రేషన్​కార్డులు జారీచేస్తుంది. అలాగే పంటబీమాల పథకాన్ని అమలు చేస్తున్నాము. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాము.

మంత్రి : సరే నేను వెళ్లొస్తా బై! బై!

ఉచిత బస్సు పథకంపై కావాలనే అవహేళన వీడియోల ప్రచారం : మంత్రి పొన్నం - MINISTER PONNAM ON FREE BUS VIDEOS

హైదరాబాద్​కు ఒక్క రూపాయి తీసుకురానివాళ్లు మనకు అవసరమా? : మంత్రి పొన్నం - PONNAM ON HYDERABAD DEVELOPMENT

Last Updated : Aug 3, 2024, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details