Minister Ponnam Prabhakar on Water Problem in Telangana : దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటే దాన్ని కొందరు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని దుష్ప్రచారం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రిపొన్నం ప్రభాకర్ విమర్శించారు. సంకుచిత మనస్తత్వంతో ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం సరికాదన్నారు. కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలతో పాటు కొత్తపల్లిలో మెడికల్ కాలేజీ భననానికి, ఉప్పరి మల్యాలలో సబ్స్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. విద్యార్థులు వ్యవసాయ రంగంలో కొత్త మెలకువలు నేర్చుకుని రైతులకు అదనపు ఆదాయం వచ్చే విధంగా శిక్షణ పొందాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
Ponnam Comments On BRS :దేశవ్యాప్తంగా తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయని అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచనలు చేసినా ఆ అంశాన్ని కూడా కొంతమంది నాయకలు రాజకీయం చేస్తున్నారని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు (Water Problem In Telangana) కాంగ్రెస్ వల్లనే వచ్చిందని ముఖ్యమంత్రి స్థాయిలో పని చేసిన నాయకులు కూడా విమర్శించడం మూర్ఖత్వానికి నిదర్శనమని పొన్నం దుయ్యబట్టారు. సెప్టెంబర్లో వర్షాలు కురవాల్సి ఉండగా కురవలేదని ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Past Ruling) ఉందని దానికి కారణం వారేనని తాము నిందించడం లేదని ఆయన పేర్కొన్నారు. కరువు అనేది ప్రకృతి, వర్షాలు పడకపోవడం వల్ల వస్తుందని అన్నారు. దానికి ఇతరులను విమర్శించడం సరికాదన్నారు.
'జీవో 317, 46 సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కరించండి'