Telangana Job Calendar Release Tomorrow in Assembly : నేడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. యువతకు హామీ ఇచ్చిన ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. అలాగే త్వరలో ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. పేదలకు తెల్లరేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తామని చెప్పారు. రేషన్ కార్డుల జారీ విధివిధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మంత్రివర్గ నిర్ణయాలను ప్రెస్‌మీట్ పెట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
క్రీడాకారులు ఈషాసింగ్, నిఖత్ జరీన్, సిరాజ్‌కు 600 గజాలు చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. విధుల్లో చనిపోయిన రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మరో అధికారి మురళి కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వనున్నట్లు వివరించారు.
"ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్‌కు మళ్లీ ప్రతిపాదనలు పంపుతున్నాం. కోదండరాంరెడ్డి, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి గవర్నర్‌కు పంపాలని నిర్ణయించాం. నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నగరంలో మూసీ సుందరీకరణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గోదావరి జలాలను హైదరాబాద్ జంట జలాశయాలకు తరలిస్తాం. మల్లన్న సాగర్ నుంచి జంట జలాశయాలకు గోదావరి జలాలు తరలిస్తాం." అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
" జాబ్ క్యాలెండర్‌ను అసెంబ్లీలో విడుదల చేస్తున్నాము. త్వరలో తెల్ల రేషన్‌కార్డులు ఇచ్చే ప్రారంభం. అలాగే పేదలకు రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తాము. క్రీడాకారులు ఈషాసింగ్, నిఖత్ జరీన్, సిరాజ్‌లకు 600 గజాల చొప్పున ఇంటి స్థలం.కోదండరాంరెడ్డి, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి గవర్నర్‌కు పంపాం. ఎమ్మెల్సీలుగా నియామకం కోసం. గౌరవెల్లి ప్రాజెక్టు త్వరిత గతిన పూర్తి కావడానికి అధిక మొత్తం కేటాయించాం."- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి