తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఆర్​ఎస్​ చేసిన కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపు టపాసులా పేలుతుంది : పొంగులేటి

గత ప్రభుత్వంలో ధరణి, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారన్న పొంగులేటి - కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుందని వెల్లడి

Minister Ponguleti Comments On BRS
Minister Ponguleti Comments (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Minister Ponguleti Comments On BRS :పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ్​ చేసిన అనేక కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని ఫోన్‌ ట్యాపింగ్‌, ధరణి, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారన్నారు. వారిని అరెస్టు చేయాలా? లేదా జీవిత కాలం జైళ్లో పెట్టాలా? అనేది చట్టం చూసుకుంటుందని మంత్రి తెలిపారు.

ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుందన్న పొంగులేటి, అది ప్రభుత్వ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి వారు ఫలితాలు అనుభవించారని ఆరోపించారు. నాలుగో రోజు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రాష్ట్ర ప్రతినిధుల బృందం, మూసీ సుందరీకరణ తదితర అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేస్తుంది.

'గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయి. ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. కొందరు డబ్బులకు ఆశపడి ధరణి, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారు. కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుంది. మేము సియోల్‌ నుంచి హైదరాబాద్‌లో దిగేలోపే పేలుతుంది. అరెస్టు చేయాలా, జీవిత కాలం జైళ్లో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుంది. ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుంది. మా నిర్ణయం కాదు. తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి సంపాదించారు. చట్టాలు అతిక్రమించిన వారు ఫలితాలు అనుభవిస్తారు." - మంత్రి పొంగులేటి

సియోల్​ నగరంలో హాన్​ నది సందర్శన : దక్షిణ కొరియాలో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు పర్యటిస్తున్నారు. అధికారులు ఆ దేశ రాజధాని సియోల్‌లో ముఖ్యమైన హాన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్​ను ఇటీవల సందర్శించారు. అక్కడ కాలుష్యంలో ఉన్న హాన్ నదిని దక్షిణ కొరియా శుభ్రపరచి మంచి నీటి సరస్సుగా పునరుద్దించింది. ప్రక్షాళన తర్వాత హాన్ నది ఇప్పుడు సియోల్ నగరానికి ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా, జల వనరుగా ఏర్పడింది. ఈ క్రమంలో హాన్ నదిని గమనించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దశల వారీగా మూసీ ప్రక్షాళన చేసి తీరతామని, పరీవాహకంలో నివసించే ప్రతి పేదవాడికీ న్యాయం చేస్తామని తెలిపారు.

కొరియన్‌ స్పోర్ట్స్‌ వర్శిటీలా - తెలంగాణలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ

సౌత్​ కొరియాలోని డిమిలిటరైజేషన్ జోన్​ను సందర్శించిన తెలంగాణ టీమ్

ABOUT THE AUTHOR

...view details