ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దెబ్బతిన్న కాల్వలు, గండ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: మంత్రి నిమ్మల - Nimmala Ramanaidu Video Conference

Nimmala Ramanaidu Video Conference: దెబ్బతిన్న కాల్వలు, గండ్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. వరద నష్టం, గండ్ల పూడికపై జలవనరుల శాఖ అధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆఖరి ఎకరం వరకు సాగు నీరు అందించాలనేదే ప్రధాన ఉద్దేశమన్న మంత్రి నిమ్మల, గట్లకు ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో గుర్తించి వెంటనే పూర్తిచేయాలన్నారు.

Minister Nimmala Ramanaidu
Minister Nimmala Ramanaidu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 4:30 PM IST

Nimmala Ramanaidu Video Conference with Collectors: ఆంధ్రప్రదేశ్​లో అకాల వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న కాలువలు, డ్రైన్లు, చెరువులకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఆఖరి ఎకరం వరకు సాగు నీరు అందించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇరిగేషన్ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావులతో కలిసి ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు, రాష్ట్రంలోని ఇరిగేషన్ సీఈ, ఎస్ఈ, ఈఈలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నష్టం, గండ్ల పూడిక పనులపై జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు, ఎస్​ఈ, ఈఈలతో అత్యవసర సమావేశం చేపట్టారు.

గట్లకు ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో గుర్తించిన వాటిని వెంటనే పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు సైతం క్షేత్రసాయిలో పర్యవేక్షించి అత్యవసర పనులుగా గండ్లను కలెక్టర్ స్థాయిలోనే అనుమతులు ఇచ్చి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆఖరి ఎకరం వరకూ రైతులకు సాగునీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. గోదావరి డెల్టా సిస్టమ్​లో ప్రధానంగా ఏలేరు, అమ్మిలేరు, ఎర్ర కాలువ, బుడమేరు, కొల్లేరుకు సంబంధించి గండ్లతో పాటు ఆక్రమణ కూడా గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

కృష్ణా డెల్టా సిస్టమ్​లో ఏలూరు, బందరు, బుడమేరుతోపాటు గూడూరు ఛానల్ గండ్లను పోల్చడంతోపాటు బకింగ్ హాం కెనాల్ శివారు ప్రాంతం వరకు నీరు అందాలని సూచించారు. నాగార్జునసాగర్ కుడి కాలువ చివరికి సాగునీరు అందడంతోపాటు ఎడమ కాలువ కింద ఉన్న కాలువలు, చెరువులు గండ్లను పూడ్చాలన్నారు. గండ్ల పూడికకు సంబంధించి తాత్కాలికంగా చేసిన పనులను శాశ్వతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి కుట్ర పన్నిన వారిని వదిలేది లేదు : మంత్రి నిమ్మల - Nimmala Inspected Prakasam Barrage

"శభాష్ రామానాయుడు"- వరద నియంత్రణ చర్యలపై చంద్రబాబు ప్రత్యేక అభినందనలు - CBN CONGRATULATED NIMMALA

ABOUT THE AUTHOR

...view details