LIVE : ఏపీ బడ్జెట్ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2024, 10:12 AM IST

Updated : Nov 11, 2024, 1:00 PM IST

AP Budget Sessions 2024 Live : అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాససనభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2024-25 ఏడాదికి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. సుమారు రూ.2.90 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు 4 నెలలకుగాను ఓటాన్‌ అకౌంట్‌ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరో 4 నెలలకు ఓటాన్‌ అకౌంట్‌  ప్రవేశపెట్టింది.ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్‌ ఆమోదంతోపాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న కాలం నాలుగు నెలలే. ప్రస్తుత ప్రభుత్వానికి తాను అనుకున్న లక్ష్యాలు సాధించే క్రమంలో డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు తొలి అడుగులు వేసేందుకే ఈ బడ్జెట్‌ ఆస్కారం కల్పిస్తుంది. మరోవైపు శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటామని ఇప్పటికే వైఎస్సార్సీపీ ప్రకటించింది. అసెంబ్లీలో జరిగిన అంశాలపై మీడియాతో బయట తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తామని వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ చెప్పారు. 
Last Updated : Nov 11, 2024, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.