ETV Bharat / state

దగాపడ్డవారికి బాసటగా లోకేశ్​ - గల్ఫ్‌ దేశాల బాధితులకు అండగా

గల్ఫ్‌ దేశాల బాధితులను ఆదుకుంటున్న మంత్రి లోకేశ్​

Lokesh Helps Gulf Victims
Lokesh Helps Gulf Victims (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2024, 7:48 AM IST

Lokesh Helps Gulf Victims : బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు దగాపడ్డామనని ఓ పోస్ట్ పెడితే వారిని ఆదుకోవడంలో మంత్రి లోకేశ్​ తనదైన ముద్ర చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదు నెలల కాలంలోనే ప్రభుత్వ యంత్రాంగం, టీడీపీ-ఎన్నారై విభాగం నేతల సమన్వయంతో సుమారు 20 మందిని స్వస్థలాలకు చేర్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు.

బాధితులకు అండగా లోకేశ్​ : చాలీచాలని ఆదాయాలతో బతుకుభారంగా మారిన కొందరు సగటు జీవులు కష్టాల కడలి నుంచి గట్టేకేందుకు ఎడారి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. అలాంటి వారికి నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు మంత్రి లోకేశ్​. ఇబ్బందుల్లో ఉన్నామంటూ బాధితులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెడితే చాలు మెరుపువేగంతో స్పందిస్తూ గొడ్డు చాకిరీ నుంచి వారికి విముక్తి కల్పిస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా తెలుగుదేశానికి అనుబంధంగా పనిచేసే ఎన్నారై టీడీపీ బృందాలనూ రంగంలోకి దింపి బాధితులను ఎడారి కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నారు.

అన్నమయ్య జిల్లాకు చెందిన చింతపర్తి శివ ఆర్థిక పరిస్థితి బాగోలేక కుటుంబాన్ని పోషించుకునేందుకు కువైట్ వెళ్లారు. కనుచూపు మేరలో జనావాసాలే ఉండని ఎడారి ప్రాంతంలో గుర్రాలు, ఒంటెలు, కుక్కలు వంటి పెంపుడు జంతువులకు ఆహారం, నీరు అందించే పని తనకు ఇచ్చారు. అక్కడ తన కష్టాలను సెల్​ఫోన్​లో వీడియో తీసి రాష్ట్రంలో ఉన్న మిత్రులకు పంపారు. సోషల్‌మీడియా ద్వారా బాధితుడి కష్టాలు తెలుసుకున్న లోకేశ్​ వెంటనే శివను స్వస్థలానికి రప్పించే ఏర్పాట్లు చేశారు.

ఎన్నారై టీడీపీ నేతల సహకారంతో : రాజానగరం మండలానికి చెందిన కొత్తపల్లి ప్రియాంక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన చిగురుపాటి బేబి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన నమిడి ప్రమీల, అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన సరెళ్ల వీరేంద్ర కుమార్ ఏజెంట్ల ద్వారా గల్ఫ్‌ దేశాలకు వెళ్లి మోసపోయారు. వీరి ఉదంతాలను వారి కుటుంబసభ్యులు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న లోకేశ్​ ఏపీఎన్​ఆర్​టీ , ఎన్నారై టీడీపీ నాయకులను అప్రమత్తం చేయడంతో వారు రంగంలోకి దిగి బాధితులను స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేశారు. ఏపీఎన్​ఆర్​టీ, టీడీపీ, భారత రాయబార కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎన్నారై ప్రతినిధులు బాధితులు ఉన్న ప్రదేశానికి చేరుకుని ఎంబసీ సహకారంతో వారిని స్వదేశానికి పంపిస్తున్నారు.

ఏపీఎన్​ఆర్​టీ, టీడీపీ, భారత రాయబార కార్యాలయం నుంచి లభిస్తున్న సమాచారం ఎన్నారై టీడీపీ ప్రతినిధులకు ఊతమిస్తోంది. బాధితులు వీడియోల్లో ఇబ్బందులు చెప్పడమేగానీ తాము ఎక్కడున్నది చెప్పట్లేదు. దీంతో వారి ఆచూకీ తెలుసుకోవడం టీడీపీ ప్రతినిధులకు కత్తీమీద సాములాగా మారుతోంది. స్థానిక వనరులు, దౌత్య కార్యాలయం, ఏజెన్సీల వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి బాధితులను చేరుకుంటున్నారు.

యజమానిని, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను సంప్రదించి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే వారు డిమాండ్‌ చేసే డబ్బులను చెల్లిస్తున్నారు. ఇవ్వాల్సింది ఎక్కువ మొత్తమైతే నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. తిరుగు ప్రయాణం ఏర్పాట్లు పూర్తయ్యేవరకు బాధితులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. విమాన టికెట్ల ఖర్చునూ భరిస్తున్నారు.

Imran stuck in Dubai: చిత్రహింసలు పెడుతున్నారు రక్షించండి.. దుబాయ్‌లో ఆదోని యువకుడి ఆవేదన

సౌదీ నుంచి వీరేంద్రకుమార్‌ను తీసుకొచ్చేందుకు చర్యలు- బాధితుడి కుటుంబ సభ్యులతో ఆర్డీవో - SaudiArabia victim

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.