Minister Nimmala on Alliance Government Victory on irrigation Elections :రాష్ట్రంలో నిర్వహించిన సాగు నీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందని మంత్రి నిమ్మల రామానాయుడు హర్షం వ్యక్తం చేశారు. కూటమిలోని అన్ని పార్టీల ఐక్యతకు అన్నదాతలు ఏకపక్షంగా మద్దతు పలికారన్నారు. గత ఐదేళ్లపాటు నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్ మోహన్ రెడ్డికి, అతని పార్టీకి ఈ ఎన్నికలు ఒక చెంపపెట్టని వ్యాఖ్యానించారు. గత అయిదు సంవత్సరాల రైతు వ్యతిరేఖ పాలనతో విసుగెత్తిపోయిన రైతులు, జగన్ పార్టీ తరపున నామినేషన్ వేయడానికి గానీ, బలపరిచడానికి గానీ ఏ ఒక్క రైతు ముందుకు రాలేదన్నారు. సాగు నీటి సంఘాల ద్వారా రైతులకు రైతుబిడ్డలే సేవ చేసుకునేలా దాదాపు 60 వేల మందికి సాగు నీటిరంగంలో ప్రాతినిధ్యం కల్పించామన్నారు.
నిజమైన రైతు ప్రభుత్వం అంటే ఇదే అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. సాగు నీటి పారుదల వ్యవస్ద మరింత బలపడటానికి ఎన్నికైన అన్నదాతలు ఎంతో దోహదపడతారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించుకుందని స్పష్టం చేసారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిస్తే, ఇప్పుడు సాగు నీటిసంఘాల ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో ఏకగ్రీవంగా విజయం సాదించామన్నారు.
సాగునీటి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హవా - పులివెందులలో ఏకగ్రీవం